మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు వృద్ధి రేటు 6 శాతం నుండి 7 శాతం సాధించాలంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్ల నుండి రిస్క్ క్యాపిటల్‌ను మరింత ఆహ్వానించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే కార్పోరేట్ పాలనలోను పలు మార్పులు తీసుకు రావాలన్నారు.

రియల్, బంగారంపై పెట్టుబడి నుండి...
చాలాకాలంగా ఇండియన్ ఇన్వెస్టర్లు ఎక్కువగా రియల్ ఎస్టేట్, బంగారంపై పెట్టుడి పెడుతున్నారని, ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఈక్విటీ వంటి వాటి వైపు మరలుతున్నారని ఉదయ్ కొటక్ అన్నారు. నేటి ఆర్థిక వ్యవస్థ ఈ మార్పును మళ్లీ మార్చాలన్నారు. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు మరింత రిస్క్ కేపిటల్ మార్కెట్లోకి రావాల్సిన అవశ్యకత ఉందన్నారు.

మూలధనం తిరిగి రావడం ముఖ్యం..
మూలధనంపై రాబడి కంటే మూలధనం తిరిగి రావడం చాలా ముఖ్యమని ఉదయ్ కొటక్ అన్నారు. కేవలం ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్ల (FPI) నుండి మాత్రమే కాకుండా డొమెస్టిక్ ఇన్వెస్టర్ల నుండి కూడా రిస్క్ క్యాపిటల్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే స్టార్టప్స్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ వృద్ధి సాధిస్తాయన్నారు.

FPIలపై ఆధారపడితే సరిపోదు..
కేవలం FPIలపై ఆధారపడితే సరిపోదని ఉదయ్ కొటక్ అన్నారు. గ్లోబల్ కార్పోరేట్ వ్యవస్థలో భారత్ లీడర్‌గా ఎదగాలంటే.. బాధ్యతాయుతమైన గవర్నెన్స్, నైతికపరమైన చర్యలతో వ్యాపార వ్యూహాలు సంపూర్ణంగా ఉండాలన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications