ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 2) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 125.34 పాయింట్లు(0.32%) నష్టపోయి 39,739.41 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31.30 పాయింట్లు(0.27%) లాభపడి 11,673.70 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం పన్నెండున్నర సమయానికి సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో ఉంది.
782 షేర్లు లాభాల్లో, 319 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 47 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నిఫ్టీ బ్యాంకు సూచీ 2 శాతానికి పైగా ఎగిసింది. నిఫ్టీ ఎనర్జీ 1 శాతం నష్టపోయింది. డాలర్ మారకంతో రూపాయి 74.29 వద్ద ట్రేడ్ అయింది. గురువారం 74.11 వద్ద క్లోజ్ కాగా, నేడు 31 పైసలు పడిపోయి 74.42 వద్ద ప్రారంభమైంది.

కుప్పకూలిన రిలయన్స్ షేర్
మధ్యాహ్నం గం.12 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా, బీపీసీఎల్ ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 5 శాతానికి పైగా పడిపోయింది. దీంతో ఈ స్టాక్ ధర రూ.2000 దిగువకు వచ్చింది. మధ్యాహ్నం సమయానికి రూ.1,945 వద్ద ట్రేడ్ అయింది. గత ఐదు నెలల కాలంలో రిలయన్స్ షేర్ 5 శాతానికి పైగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఒకరోజులో అత్యంత పతనమైంది. రిలయన్స్ రెండు రోజుల క్రితం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. లాభాలు తగ్గడంతో స్టాక్ పడిపోయింది.

రిలయన్స్‌కు ఫలితాల దెబ్బ
క్రితంసారి 13 మే రోజున రిలయన్స్ భారీగా పడిపోయి రూ.1950 డాలర్లు పలికింది. ఈ ఏడాది రిలయన్స్ స్టాక్ 31 శాతం ఎగిసింది. అయితే కరోనా పరిస్థితులు, పెట్టుబడుల కారణంగా రిలయన్స్ స్టాక్ పడిలేచింది. రిలయన్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి నికర లాభం రూ.9,567 కోట్లుగా నమోదయింది. అయితే ఏడాది ప్రాతిపదికన 15 శాతం క్షీణించింది. జియో మినహా ఆయిల్ టు గ్యాస్ వ్యాపారంపై ప్రభావం పడింది.

ఐటీ డౌన్, రియాల్టీ జూమ్
మారుతీ సుజుకీ అక్టోబర్ సేల్స్ 19 శాతానికి పైగా ఎగిశాయి. ఇతర ఆటో కంపెనీల సేల్స్ కూడా పెరిగాయి. దీంతో ఆటో స్టాక్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
ఐటీ స్టాక్స్ నష్టపోయాయి. టీసీఎస్ 1.90 శాతం, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్ 2.19 శాతం, ఇన్ఫోసిస్ 0.014 శాతం, విప్రో స్టాక్ 1.85 శాతం, మైండ్ ట్రీ 0.66 శాతం, కోఫోర్జ్ స్టాక్ 3.61 శాతం పడిపోయింది. కేవలం టెక్ మహీంద్ర మాత్రం 0.18 శాతం ఎగిసింది.
నిఫ్టీ బ్యాంకు 2.64 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ 1.89 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకులు 2.79 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.53 శాతం ఎగిశాయి.
అదే సమయంలో నిఫ్టీ ఆటో 0.57 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.70 శాతం, నిఫ్టీ ఫైనాన్స్ 0.27 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.28 శాతం, నిఫ్టీ ఐటీ 0.82 శాతం, నిఫ్టీ మీడియా 0.40 శాతం, నిఫ్టీ ఫార్మా 1.17 శాతం, నిఫ్టీ మెటల్ 0.37 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications