కరోనా వైరస్ ప్రపంచ మార్కెట్లను ముంచేసింది. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడంతో గురువారం సెన్సెక్స్ ఏకంగా 2,919 పాయింట్లు నష్టపోయి 32,778, నిఫ్టీ 868 పాయింట్లు కోల్పోయి 9,590 వద్ద క్లోజ్ అయింది. ఈ మహమ్మారి కారణంగా భారత్ సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. దాదాపు 4,600 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కరోనాకు రష్యా, సౌదీ చమురు యుద్ధం కూడా తోడయింది.
కరోనా దెబ్బతో భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు
భారత మార్కెట్లు గురువారం తీవ్రంగా పతనం కావడంతో రూ.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 11,27,160 కోట్లు కోల్పోవడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,25,86,398 కోట్లకు తగ్గింది. ఇది బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.1,37,13,558 కోట్లుగా ఉంది. అంటే 11 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్లు నష్టపోయారు.

ఫిబ్రవరి 1 నుండి మార్కెట్లు ఇలా కుప్పకూలాయి...
ఫిబ్రవరి 1వ తేదీ నుండి పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు రూ.3.5 లక్షల కోట్లు నష్టపోయారు. ఆ తర్వాత కరోనా వైరస్ కారణంగా వరుసగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఫిబ్రవరి 24న రూ.3.18 లక్షల కోట్లు, ఫిబ్రవరి 28న 5.45 లక్షల కోట్లు, మార్చి 6న 3.28 లక్షల కోట్లు, మార్చి 9న 6.84 లక్షల కోట్లు,మార్చి 12న 11.27 లక్షల కోట్లు నష్టపోయారు. అంటే ఈ కొద్ది రోజుల్లోనే రూ.33 లక్షల కోట్లు ఆవిరైంది.

ముఖేష్ అంబానీపై కరోనా దెబ్బ
దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ సోమవారం నాడు భారీగా నష్టపోయారు. తాజాగా గురువారం కూడా నష్టాలను చవిచూశాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 9 శాతం నష్టపోయి 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ రెండు నెలల వ్యవధిలోనే రిలయన్స్ షేర్ ఏకంగా 28 శాతం మేర కోల్పోయింది.

రూ.1.11 లక్షలు కోల్పోయిన ముఖేష్
రిలయన్స్ తీవ్రంగా నష్టపోతుండటంతో ముఖేష్ సంపద కూడా అదేస్థాయిలో కోల్పోతున్నారు. గురువారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ముఖేష్ సంపాదనలో 1.11 లక్షల కోట్లు (15.2 బిలియన్ డాలర్లు) ఆవిరైంది. 70 రోజుల్లోనే ముఖేష్ ఇంత సంపద కోల్పోయారు. నిన్నటి వరకు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముఖేష్ అంబానీ కరోనా దెబ్బతో రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే.

6-8 శాతం మేర నష్టపోయిన అమెరికా మార్కెట్లు
ఇదిలా ఉండగా, బుధవారం ఆరంభంలోనే అమెరికా స్టాక్స్ 7% నష్టపోతే, ట్రేడింగ్ 15 నిమిషాల నిలిపివేశారు. ఆ తర్వాత ట్రేడింగ్ ప్రారంభమైనా ఈ సూచీలు ఆరు నుండి ఎనిమిది శాతం మేర పతనమయ్యాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి చూస్తే బుధవారం అమెరికా స్టాక్స్ 20% మేర నష్టపోయి బేర్‌లోకి వెళ్లిపోయాయి.

ప్రపంచ మార్కెట్లదీ అదే దారి
కరోనా వైరస్‌ను మహమ్మారి వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం, అమెరికా స్టాక్ మార్కెట్ బేర్ దశలోకి వెళ్లడంతో ప్రపంచ మార్కెట్లు కూడా అల్లకల్లోలమయ్యాయి. ఆసియా మార్కెట్లు 1.5 నుండి 4.4% నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 6% నష్టాలతో మొదలై 11-12% నష్టాల్లో ముగిశాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై నీ పెత్తనమేంది.. అమెరికాపై విరుచుకుపడిన చైనా.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications