రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చమురు రిటైల్ మార్కెట్లో సత్తా చాటుతోంది. డిసెంబర్ 31, 2019 నాటికి రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్ బంకుల్లో విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. డీజిల్ విక్రయాల్లో 11 శాతం వృద్ధిని, పెట్రోల్ సేల్స్‌లో 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు రిలయన్స్ తన ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుతం చమురు రిటైల్ పరిశ్రమ వృద్ధి రేటు డీజిల్‌లో 0.2 శాతం, పెట్రోల్‌లో 7.1 శాతంగా ఉంది. ఈ వృద్ధితో పోలిస్తే రిలయన్స్ భారీ వృద్ధి సాధించినట్లే. రిలయన్స్ పెట్రో రిటైల్ రెవెన్యూ 5 శాతం పెరిగి రూ.3,725 కోట్లకు చేరుకుంది. దాదాపు 538 మిలియిన్ లీటర్ల ఇంధనాన్ని విక్రయించింది.

రిలయన్స్ చేతిలో 1,394 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఇందులో 518 సొంతగా నిర్వహిస్తోంది. మిగతా వాటిని డీలర్స్ నిర్వహిస్తున్నారు. తమ పెట్రో రిటైల్ బిజినెస్ వ్యాపారంలో 49 శాతాన్ని యూకేకు చెందిన బీపీకి రూ.7,000 కోట్లకు విక్రయించేందుకు రిలయన్స్ అంగీకరించింది. రిలయన్స్ - బీపీ జాయింట్ వెంచర్ రానున్న అయిదేళ్లలో నెట్ వర్క్‌ను 5,500కు పెంచుకోనున్నాయి.
నాణ్యమైన ఉత్పత్తులు, ఉన్న ఆస్తులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో మంచి రాబడులను సాధించామని, పెట్రోల్ కార్ల విక్రయాలు పెరగడం, రోడ్లు మెరుగుపడటం, గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధానం పెరగడం వంటివి పెట్రోల్‌కు డిమాండ్ పెంచినట్లు రిలయన్స్ పేర్కొంది. భారీ సంఖ్యలో వాహనాలు ఉన్న కస్టమర్ల సంఖ్య పెరగడంతో వృద్ధి రేటు పెరిగిందన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications