ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మంగళవారం కొద్ది సమయంలోనే భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు జీరో కంటే కిందకు పడిపోవడం రిలయన్స్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో ఏప్రిల్ 20న ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లో రిలయన్స్ ఇన్వెస్టర్ల సంపద రూ.30,000 కోట్లు హరించుకుపోయింది.

ముఖేష్ అంబానీకి క్రూడ్ దెబ్బ
చరిత్రలోనే తొలిసారి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) ధర మైనస్ పలికింది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఆ సమయంలో రిలయన్స్ సంపద భారీగా నష్టపోయింది. గత కొద్ది వారాలుగా రిలయన్స్ షేర్లు పడిపోతున్నాయి. క్రూడా ధరల పతనం దీనిపై భారీగా ఉంది.

సంపద కోల్పోతున్న ముఖేష్
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ ఏడాది మార్చి 19 వరకు ముఖేష్ అంబానీ నెట్ వర్త్ 41 శాతం పడిపోయి 34.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్ 20వ తేదీ వరకు క్రమంగా కోలుకొని 45 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ జాబితాలో ఆయన టాప్ 10 నుండి 19వ స్థానంలోకి పడిపోయారు. ముఖేష్ ఆస్తి ఈ ఏడాది ప్రారంభంలో 58.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

చమురు ధరలు తగ్గితే అంతే
ముఖేష్ లేదా రిలయన్స్ సంపద అంతా ఎక్కువగా రిటైల్, రిఫైనింగ్, టెలికం రంగంలోనే ఉంది. ఈ షేర్లు లాభపడినప్పుడు అతని సంపద పెరుగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేది చమురు బిజినెస్ నుండి. చమురు ధరల పెరుగుదల, తగ్గుదలపై ముఖేష్ అంబానీ, రిలయన్స్ కంపెనీ సంపద పెరగడం, తగ్గడం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. రిలయన్స్ స్టాక్స్ నిన్న 4 శాతం పడిపోయాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications