Mukesh Ambani: కొడుకు కోసం హామీగా నిలిచిన ముఖేష్ అంబానీ.. మ్యాటర్ ఏంటంటే..??
Mukesh Ambani: రిలయన్స్ గ్రూప్ కంపెనీల బాధ్యతలను వారసులకు అప్పగించినప్పటికీ వాటిని ముఖేష్ అంబానీ పర్యవేక్షిస్తూనే ఉన్నారు. యాజమాన్య బాధ్యతలు చేపట్టిన వారసుల వ్యాపారాలను కాపాడుతున్నారు. తాజాగా ఆకాష్ అంబానీ కంపెనీ కోసం హామీగా నిలిచారు.
దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ముఖేష్ అంబానీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఉన్న అనేక అనుబంధ సంస్థల్లో కొన్నింటి బాధ్యతలు పిల్లలు నిర్వహిస్తున్నారు. అలా టెలికాం వ్యాపారం రిలయన్స్ జియోను అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ నాయకత్వంలో వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G రోల్‌అవుట్‌ను ప్రకటించారు.

5జీ ఆకాంక్షలను అందుకునే క్రమంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.7,706 కోట్ల హామీని జారీ చేసింది. ఇది జియోకు 5G పరికరాల సరఫరా కోసం దాని అనుబంధ సంస్థ రిలయన్స్ జియోకు క్రెడిట్ పొడిగింపును అందించడానికి దోహదపడుతోంది. హామీ RIL పై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
ఆకాష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ అందుబాటులోకి తెచ్చేందుకు రూ.2 ట్రిలియన్ పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో వేగవంతమైన విస్తరణ కోసం 5G పరికరాల సేకరణ కోసం, రిలయన్స్ జియో గ్లోబల్ నెట్‌వర్క్ పరికరాల ప్రొవైడర్లు నోకియా, ఎరిక్సన్, శాంసంగ్, సిస్కోలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. అలాగే జియో 5G స్పెక్ట్రమ్ కోసం రెండవ విడతగా టెలికాం అథారిటీకి రూ.7,864 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది జియో 700MHz, 800MHz, 1800MHz, 3300MHz, 26GHz బ్యాండ్‌లలో 5G స్పెక్ట్రమ్‌ను రూ.88,078 కోట్లకు దక్కించుకుంది.


Click it and Unblock the Notifications