Reliance: ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనరీల్లో ఒకటిగా ఉన్న రిలయన్స్ భవిష్యత్తు ఇంధన అవసరాలపై భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం సైతం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై భారీగా దృష్టి సారించినట్లు ఇటీవల వార్షిక బడ్జెట్లోనూ ప్రస్థావించింది. అయితే ప్రస్తుతం ముఖేష్ అంబానీ ఆధీనంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసిన ప్రకటన పెద్ద సంచలనంగా మారింది.
నయా టెక్నాలజీ..
హైడ్రోజన్ తో నడిచే వాహనాలకు ప్రత్యేక సాంకేతికత అవసరం. అందుకే దీనిని అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇందులో భాగంగా హెవీ డ్యూటీ ట్రక్కుల కోసం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు రిలయన్స్, అశోక్ లేలాండ్ కంపెనీలు జతకట్టిన విషయం మనందరికీ తెలిసిందే. గత సంవత్సర కాలంగా దీనిపై పనిచేస్తున్న రెండు కంపెనీలు 2022 ప్రారంభంలో మెుదటి ఇంజన్ ను నడిపింది.
ఎందుకు హైడ్రోజన్ వాహనాలు..
హైడ్రోజన్ ఇంధనంగా నడిచే ట్రక్కులు సున్నా ఉద్గారాలను విడుదల చేస్తాయి. అంటే వీటి నుంచి కాలుష్యం వెలువడదు. ప్రస్తుతం వినియోగిస్తున్న సాంప్రదాయ వనరులైన డీజిల్ ట్రక్కుల కంటే తక్కువ శబ్దాన్ని వెలువరిస్తూ.. అదే స్థాయి పనితీరును కనబరచటం వీటి ప్రత్యేకత. ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకునేందుకు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ అడుగు చాలా ప్రయోజనకరమని ఆటో రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. 2050 నాటికి 3.6 గిగాటన్‌ల CO2 ఉద్గారాలను తగ్గించడంలో సాంకేతికత సహాయపడుతుందని ఇటీవల నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.
బెంగళూరులో..
కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ లో రిలయన్స్, అశోక్ లేలాండ్ కంపెనీలు తమ భారీ ట్రక్కును ప్రదర్శనకు ఉంచాయి. భారత మొట్టమొదటి హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (H2-ICE) టెక్నాలజీ సొల్యూషన్‌ను ఆవిష్కరించాయి. దీనిని ప్రధాని మోదీ ప్రారంభించారు. గ్రీన్ హైడ్రోజన్ వాడకం వల్ల నిర్వహణ వ్యయాలు సైతం తగ్గుతాయని, గ్రీన్ మెుబిలిటీ వైపు భారత్ వేస్తున్న అడుగులకు ఈ ప్రయత్నం సహాయంగా నిలుస్తుందని రిలయన్స్ గ్రూప్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

అశోక్ లేలాండ్..
రిలయన్స్ తో కలిసి పని చేయడం ద్వారా తాము సాంకేతిక నాయకత్వాన్ని, క్లీన్ మొబిలిటీ మిషన్ పట్ల తన నిబద్ధతను మరోసారి ప్రదర్శించినట్లు అశోక్ లేలాండ్ ప్రెసిడెంట్ & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎన్ శరవణన్ అన్నారు. అత్యుత్తమ R&Dతో రవాణా రంగంలో పర్యావరణ అనుకూల పరిష్కారాలను అందించేందుకు నూతన సాంకేతికతలను ఆవిష్కరణకు కృషిని కొనసాగిస్తామని అన్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో గ్యాస్ కష్టాలు.. హోటళ్లు మూతపడే ప్రమాదం?

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications