For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరామ్‌కో డీల్‌కు ముందు రిలయన్స్ కీలక ప్రకటన, O2C బిజినెస్ డీమెర్జర్

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ మంగళవారం కీలక ప్రకటన చేసింది. తన O2C (చమురు నుండి కెమికల్) వరకు ఉన్న వ్యాపారాన్ని డీ-మెర్జ్ చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో భారీ డీల్స్ కుదుర్చుకునే అవకాశాల కోసం పూర్తిస్థాయి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా ప్రకటించింది. ఇప్పటికే చమురు రంగ దిగ్గజం సౌదీ ఆరామ్‌కోతో చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 23న విడుదల చేసిన ప్రకటన ప్రకారం O2C వ్యాపారాన్న డీ-మెర్జ్ ప్రణాళికను షేర్ హోల్డర్స్, క్రెడిటార్స్ ముందు ఉంచింది. స్వతంత్రంగా ఉండటం ద్వారా O2C అవకాశాలపై దృష్టి సారించి వ్యాల్యూను మరింత పెంచేలా ఉంటుందని అభిప్రాయపడింది. స్వయం మూలధన నిర్మాణం, అంకితభావం కలిగిన మేనేజ్‌మెంట్ టీమ్ ద్వారా వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటుందని తెలిపింది.

RIL announces demerger of oil to chemical business as talks with Aramco resume

వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా వ్యాల్యూ మరింత పెరిగేందుకు డీ-మెర్జర్ దోహదపడుతుందని తెలిపింది. కాగా, ఆరామ్‌కో డీల్‌కు ముందు రిలయన్స్ O2C వ్యాపార డీ-మెర్జర్‌ను ప్రకటించింది.

English summary

ఆరామ్‌కో డీల్‌కు ముందు రిలయన్స్ కీలక ప్రకటన, O2C బిజినెస్ డీమెర్జర్ | RIL announces demerger of oil to chemical business as talks with Aramco resume

Reliance Industries on Tuesday announced the demerger of its O2C (oil-to-chemical) business into a wholly-owned subsidiary as the company eyes mega deals in future, including with oil behemoth Saudi Aramco.
Story first published: Tuesday, February 23, 2021, 11:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X