ముంబై:ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకెళ్తోంది. ఇప్పటికే డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులకు ముందే రిలయన్స్ సంస్థ.. యూకేకు చెందిన బీపీ, సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కోతో చమురు సహా వివిధ రంగాల పెట్టుబడులపై చర్చలు జరుపుతోంది. తాజాగా రిలయన్స్-బీపీ మధ్య అతి కీలకమైన డీల్ కుదిరింది. ఈ రెండు సంస్థలు కలిసి ఫ్యూయల్, మొబిలిటీలో జాయింట్ వెంచర్‌ను ప్రారంభిస్తున్నాయి. ఈ మేరకు గురువారం ప్రకటన చేశాయి.

49 శాతం వాటాతో జాయింట్ వెంచర్
రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతిలో 51 శాతం ఉండేలా ఓ జాయింట్ వెంచర్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు ఈ సంస్థ గత ఏడాది ఆగస్ట్ నెలలోనే ప్రకటించింది. దాదాపు ఏడాది తర్వాత రిలయన్స్-బీపీ మధ్య జాయింట్ వెంచర్ ఒప్పందంకుదిరింది. ఇందులో రిలయన్స్ వాటా 51 శాతం, బీపీ వాటా 49 శాతంగా ఉంటుంది. RILకు 1 బిలియన్ డాలర్లు (రూ.7వేల కోట్లకు పైగా) చెల్లించిన బీపీ 49 శాతం వాటాను దక్కించుకుంది.

80,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఈ జాయింట్ వెంచర్ రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (RBML). జియో-బీపీ బ్రాండ్ ఆధ్వర్యంలో ఉంటాయి. ప్రస్తుతం 1400 ఫ్యూయల్ స్టేషన్స్ ఉండగా వీటిని 5,500కు పెంచాలని ఈ జాయింట్ వెంచర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఉన్న ఉద్యోగుల కంటే నాలుగు రెట్లు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీని వల్ల ప్రస్తుతం ఉన్న 20,000 ఎంప్లాయిమెంట్ 80,000 వేలకు చేరుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం రిలయన్స్ పెట్రోల్ పంప్స్, విమాన టర్బైన్ ఫ్యూయల్ నెట్ వర్క్‌లో బీపీ భాగస్వామ్యం కానుంది.

జియో-బీపీ
ఇప్పుటికే ఉన్న అవుట్ లెట్స్ సహా ఇక నుండి ఇవి జియో-బీపీగా మారుతాయి. ఈ జాయింట్ వెంచర్ రానున్న కొన్నేళ్లలో తమ సేవలను 30 నుండి 45 విమానాశ్రయాలకు పెంచాలని నిర్ణయించాయి. కర్బన పదార్థాల వినియోగం తగ్గించాలని కూడా RBML నిర్ణయించింది. డిజిటల్, టెక్నాలజీ సహకారంతో కస్టమర్లకు పరిశుభ్ర, సరసమైన సేవలు అందిస్తామని పేర్కొంది. తక్కువ ఉద్గారాలను అందించే ఫ్యూయల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్స్ వంటివి అందించాలని జేవీ ఆకాంక్షను వ్యక్తం చేసింది. జియో-బీపీ బ్రాండ్ భారత చమురు, మొబిలిటీ రంగంలో లీడర్‌గా ఎదగాలని భావిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications