వైద్యరంగంలో AI ద్వారా విప్లవాత్మక మార్పులు.. భారత్ తలరాతను మార్చబోతున్న నీతా అంబానీ కీలక ప్రకటన
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ముంబైలో అత్యాధునిక 2 వేల పడకల మెడికల్ సిటీని నిర్మించనున్నట్లు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇది కేవలం ఆసుపత్రి మాత్రమే కాకుండా, భారతదేశ ఆరోగ్య సంరక్షణలో కొత్త మార్గదర్శిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మెడికల్ సిటీ AI ఆధారిత డయాగ్నస్టిక్స్, అత్యాధునిక వైద్య పరికరాలు, భారతదేశం, ప్రపంచం నలుమూలల నుండి ఉత్తమ వైద్య నిపుణులతో కూడిన హబ్‌గా ఉంటుంది. ప్రతి భారతీయుడికి సరసమైన ధరలో ప్రపంచ ప్రమాణాల చికిత్స అందించడమే లక్ష్యమని నీతా అంబానీ స్పష్టం చేశారు. సర్ HN రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ఇప్పటివరకు 3.3 మిలియన్లకు పైగా రోగులను చికిత్స చేసింది. ఈ విజయాన్ని ఆధారంగా చేసుకుని, ఆమె జీవన్ అనే కొత్త విభాగాన్ని ప్రకటించారు, ఇది పిల్లల క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అంతేకాకుండా, ఈ మెడికల్ సిటీలో వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేసి, కొత్త తరం వైద్యులను తీర్చిదిద్దుతారు.

Nita Ambani తన ప్రసంగంలో రిలయన్స్ ఫౌండేషన్ గ్రామీణాభివృద్ధి రంగంలో చేసిన కృషిని వివరించారు. ఈ ఏడాది 55 వేల గ్రామాల్లో 1.5 మిలియన్ల మంది నీటి భద్రత, వ్యవసాయం, మత్స్యకార వర్గాలకు మద్దతు, మహిళల సాధికారత కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. విద్యలో భాగంగా, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలతో కలిసి 1,100 అంగన్‌వాడీలను ఆధునిక కేంద్రాలుగాఅప్‌గ్రేడ్ చేశారు. దేశంలోని 1 కోటి పిల్లలకు ప్రపంచ స్థాయి ప్రాథమిక విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
ముంబైలోని ప్రజల కోసం కోస్టల్ రోడ్ గార్డెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇది 130 ఎకరాల పట్టణ ఉద్యానవనం, నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, ప్లాజాలు మరియు తోటలతో ఉంటుంది. సాంస్కృతిక రంగంలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ఇప్పటికే ప్రపంచస్థాయి ప్రదర్శనలు, కళా కార్యక్రమాలకు వేదికగా మారింది. భారతీయ కళాకారుల ప్రతిభను ప్రదర్శించే స్వదేశ్ స్టోర్ కూడా ప్రారంభించారు.
Reliance Foundation Education and Sports for All (ESA) కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 2.3 కోట్ల మంది పిల్లలు లబ్ధి పొందారు. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన తొలి గిరిజన క్రికెటర్ రాబిన్ మింజ్ విజయాన్ని.. అలాగే మహిళా ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మహిళా జట్టు సాధించిన విజయాలను ఆమె గుర్తు చేశారు. భారతదేశం 2036 ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ నిర్వహించడానికి చేసిన బిడ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె తెలిపారు.
నీతా అంబానీ తన ప్రసంగంలో వంటారా అనే జంతు సంరక్షణ ప్రాజెక్టును హైలైట్ చేశారు. అనంత్ అంబానీ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే 1.5 లక్షల జంతువులను రక్షించింది. దీనికి ప్రాణి మిత్ర అవార్డు కూడా లభించింది.ఈ సమావేశంలో విజన్ 2035 గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రిలయన్స్ ఫౌండేషన్ రజతోత్సవం నాటికి (2035) 400 మిలియన్ల భారతీయులకు సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 300 మిలియన్ల పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటుగా 100 మిలియన్ల మహిళలకు సాధికారతను అందించనున్నారు. అలాగే 50 మిలియన్ల గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇవ్వనున్నారు.


Click it and Unblock the Notifications