Rikhav Securities IPO: ఇటీవల పండుగ వల్ల కొంత బ్రేక్ తీసుకున్న తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లోకి ఐపీవోల రాక తిరిగి స్టార్ట్ అయ్యింది. దీంతో ఐపీవోలపై తిరిగి బెట్టింగ్ వేసే వారి సంఖ్య పెరగటం మెుదలైంది. ఈక్విటీ మార్కెట్ల ఓలటాలిటీలో ప్రజలు ఐపీవోల వెనుక డబ్బుతో పరిగెడుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రిఖవ్ సెక్యూరిటీస్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీ వచ్చిన కంపెనీ షేర్లు నేడు బీఎస్ఈలో విజయవంతంగా జాబితా కోసం వచ్చాయి. ఈ క్రమంలో 90 శాతం ప్రీమియం ధర రూ.163.40 వద్ద స్టాక్ గ్రాండ్ ఎంట్రీని ఇచ్చింది. స్టెల్లార్ లిస్టింగ్ తర్వాత కూడా కంపెనీ షేర్లను పొందటానికి పెట్టుబడిదారుల నుంచి కొనసాగిన డిమాండ్ వల్ల కొద్ది నిమిషాల్లో స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో నేడు లిస్టింగ్ తర్వాత 100 శాతం లాభాలతో స్టాక్ రూ.171.57 స్థాయికి చేరింది.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.88.82 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో కంపెనీ రూ.71.62 కోట్లను తాజా ఈక్విటీ ఇష్యూ ద్వారా రైజ్ చేయగా.. మగిలిన మెుత్తం కోసం ఆఫర్ ఫర్ సేల్ కింద 20 లక్షల తాజా ఈక్విటీ షేర్లను పెట్టుబడిదారులకు అందించింది. రిటైల్ పెట్టుబడిదారులు దీనికోసం బిడ్డింగ్ వేసేందుకు జనవరి 15 నుంచి 17 వరకు అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో కంపెనీ తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.82-86గా నిర్ణయించింది.
ఐపీవో లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా కంపెనీ నిర్ణయించటంతో రిటైల్ పెట్టుబడిదారులు బెట్టింగ్ కోసం కనీసం రూ.1,37,600 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. తాజాగా ఐపీవో మార్కెట్లో జాబితా కావటంతో ప్రమోటర్ల వాటా కంపెనీలో 90.55% నుంచి ప్రస్తుతం 65.63%కి తగ్గింది. ఈ నిధులను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఐటీ సాఫ్ట్‌వేర్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు కోసం ఉపయోగించాలని నిర్ణయించింది. అలాగే కొంత భాగాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించాలని చూస్తోంది.
కంపెనీ వ్యాపారం..
వాస్తవానికి రిఖవ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 1995లో స్థాపించబడింది. వాస్తవానికి ఇదొక ఆర్థిక సేవల కంపెనీ. ఇది బ్రోకరేజ్, ఇన్వెస్టింగ్, బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీ సెబీ వద్ద స్టాక్ బ్రోకర్‌గా నమోదు చేయబడింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లలో సభ్యత్వాలను కలిగి ఉంది. కంపెనీ సేవల్లో ఈక్విటీ బ్రోకింగ్, క్యాష్ డెలివరీ, ఇంట్రా-డే ట్రేడింగ్, ఫ్యూచర్లలో సేవలను అందిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications