Chandrababu Naidu: ప్రస్తుతం దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు పేరు ముందువరుసలోకి వచ్చింది. దీంతో అసలు చంద్రబాబు ఆస్తులపై పెద్ద చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఆస్తులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మాజీ ప్రధాని నిర్ణయాలే ఆయన సంపదకు కీలకంగా మారాయానే వాదన కూడా వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అసలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే..
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఆపాదించబడిన రూ.931 కోట్ల సంపదలో దాదాపు 82 శాతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మూడు దశాబ్దాల క్రితం భారత ఆర్థిక వ్యవస్థను తన పాలసీలతో ఓపెన్ చేసిన వెంటనే ఏర్పాటు చేసిన డెయిరీ ప్రొడక్ట్ రిటైలింగ్ సంస్థ హెరిటేజ్ లో ఆయన కుటుంబానికి ఉన్న వాటాలే కారణమని కంపెనీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో వాస్తవానికి నారా చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థలో ఒక్క షేరును కూడా కలిగి లేరని వెల్లడైంది. 1992లో స్థాపించబడిన కంపెనీ డెయిరీ ఉత్పత్తులు, పాల వ్యాపారంలో చురుకుగా రిటైల్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కంపెనీ 1994లో దేశీయ స్టాక్ మార్కెట్లలో జాబితా చేయబడగా.. అందులో ఆయన భార్య భువనేశ్వరికి 24.37 శాతం వాటా ఉంది.

నారా భువనేశ్వరి వాటాల విలువ దాదాపు రూ.763 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆస్తుల లెక్కింపులో కుటుంబానికి చెందిన ఈ విలువను కూడా కలిపినట్లు వెల్లడైంది. అందువల్లే ఇటీవల అసోసియేషన్ ఆఫ్ డెమెుక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ విడుదల చేసిన సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో సీఎం చంద్రబాబు ఆస్తుల విలువను రూ.931 కోట్లుగా ప్రకటించబడింది. వాస్తవానికి ఈ కంపెనీని చంద్రబాబు ఎమ్ఎల్ఏగా ఉన్న సమయంలో స్థాపించబడింది. అలాగే ప్రైవేటు రంగంలో కొనసాగుతున్న కంపెనీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలు కూడా అందించబడలేదు. స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్ల లిస్టింగ్ తర్వాతే చంద్రబాబు తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
1990ల తొలినాళ్లలో చంద్రబాబు పుట్టిన చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పాల ఉత్పత్తి ఉన్న కారణంగా 1992లో కంపెనీని స్థాపించటం జరిగింది. అప్పట్లో రైతులకు పాలను మార్కెటింగ్ చేసుకోవటం కష్టతరంగా మారటంతో డెయిరీలకు అమ్మేవారు. ఈ క్రమంలోనే అప్పటి కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అనేక రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పించటంతో పాల ఉత్పత్తి మార్కెటింగ్ రంగాలకు మంచి రోజులు వచ్చాయి. దీనిని అవకాశంగా భావించిన చంద్రబాబు రూ.50 లక్షల పెట్టుబడితో చిత్తూరులో పాల డెయిరీని ప్రారంభించారు. తర్వాత బ్యాంక్ ఆఫర్ బరోడా ఇతర సంస్థల నుంచి రుణం పొంది వ్యాపారాన్ని విస్తరించారు.
1994లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన భార్య భువనేశ్వరి కంపెనీ బాధ్యతలు చేపట్టారు. కంపెనీ కరోనా మహమ్మారి తర్వాత రుణాల చెల్లింపులను కంపెనీ పూర్తి చేసి డెట్ ఫ్రీ కంపెనీగా మారింది. ప్రస్తుతం కంపెనీ మెుత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.4,400 కోట్లుగా ఉంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఎండీగా నారా భువనేశ్వరి వ్యవహరిస్తుండగా.. నారా బ్రహ్మిణి గడచిన 10 ఏళ్లుగా కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయిలో వ్యవహరిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications