భారతదేశంలోని 28 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల సీఎంల ఆస్తులకు సంబంధించి తాజా నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశ ముఖ్యమంత్రులలో ఆస్తుల వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. 2024 డిసెంబర్ తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది.
TIO కథనం, ADR రిపోర్ట్ ప్రకారం.. ఒక వైపు సాదాసీదా బట్టలు వేసుకుని, చేతిలో చిన్న బ్యాగ్ పట్టుకుని నడుస్తూ కనిపించే మమతా బెనర్జీ దేశంలో అత్యంత పేద సీఎంగా ఉన్నారు..మరోవైపు కోట్లు విలువైన ఆస్తులు కలిగి దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా Chandrababu నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తుల విలువ కేవలం రూ. 15 లక్షలు మాత్రమే. ఇందులో చేతిలో రూ. 69,000 నగదు, బ్యాంకులో రూ. 13.5 లక్షల బ్యాలెన్స్, 9 గ్రాముల బంగారు ఆభరణాలు..అవి కూడా రూ. 43 వేలు మాత్రమే ఉన్నాయని నివేదిక తెలిపింది.

ఆమె పేరు మీద ఇల్లు కాని, భూమి కాని ఏదీ లేదు.ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ, సాధారణ మధ్యతరగతి మహిళలా తన జీవితం కొనసాగిస్తున్నారని నివేదిక తెలిపింది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ఆస్తుల విలువ సుమారు రూ. 30.4 లక్షలుగా ఉండేది. కాని తరువాతి సంవత్సరాల్లో అది తగ్గింది. దీని వలన ఆమె సాధారణ జీవనశైలి, వ్యక్తిగత ఆస్తులపై ఆసక్తి లేకపోవడం స్పష్టమవుతుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత ధనిక సీఎంగా కొనసాగుతున్నారని నివేదిక తెలిపింది. ఆయన ఆస్తుల విలువ అక్షరాల రూ. 931 కోట్లు అని తెలిపింది. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా కార్పొరేట్ దిగ్గజం ఆస్తులకు సరిపోతుంది. ఆయన తర్వాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 332 కోట్లు. వీరిద్దరే ఈ జాబితాలో బిలియనీర్ ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు.
మిగతా ముఖ్యమంత్రుల్లో కొందరి వద్ద కోట్ల రూపాయలు ఉండగా..మరి కొందరి వద్ద కేవలం లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి.జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వద్ద రూ. 55 లక్షల ఆస్తులు ఉండగా.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వద్ద రూ. 1 కోటి ఆస్తులు ఉన్నాయి. ఇక 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల మొత్తం విలువ రూ. 1,630 కోట్లు అని ADR నివేదికలో పేర్కొంది.
ADR, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ వాచ్ కోఆర్డినేటర్ ఉజ్జయిని హలీమ్ ప్రకారం..ఎన్నికల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడవిట్లు ఆదాయపు పన్ను శాఖకు పంపుతారు. కానీ వాటిపై పరిశీలన జరిగే విధానం స్పష్టంగా తెలియదు.అయినా, అఫిడవిట్‌లో ఇచ్చిన సమాచారం ప్రజలు నమ్మదగ్గదే అని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని, ఎన్నికల ఖర్చులు అధికమవుతున్నాయని, సాధారణ నేపథ్యం ఉన్న అభ్యర్థులు పోటీ చేయడం కష్టమవుతోందని ఈ నివేదికలో హెచ్చరించారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications