కరోనా దెబ్బ... ప్రైవేట్ విమానాల్లో ప్రయాణిస్తున్న సంపన్నులు !

కరోనా వైరస్ దెబ్బకు మొత్తం ప్రపంచం వణికిపోతోంది. చైనా అయితే ఇక చెప్పక్కరలేదు. ఈ మహమ్మారి బారిన పడకుండా సామాన్యులు అయితే ఒక మాస్కు ధరించటం, చేతులు శుభ్రంగా కడుక్కుంటూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటం వంటి చిట్కాలు ఫాలో ఐపోతున్నారు. కానీ సంపన్నులు అన్నింటా ప్రత్యేకంగా ఉంటారు కదా. అందుకే వారు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సామాన్యునికి విమానాల్లో ప్రయాణించటమే కల అయితే... సంపన్నులు మాత్రం ప్రస్తుతం అందరు వెళ్లే విమానాలు కాకుండా ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్లను ఆశ్రయిస్తున్నారు.

ఒక్కో టికెట్ కు పది రెట్ల అధిక ఖర్చు అయినా ఫరవాలేదని వాటికే జై కొడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవటం లేదు. కానీ, తప్పనిసరిగా పోవాలనుకుంటే ఒక ప్రైవేట్ జెట్ విమానాన్ని బుక్ చేసుకుని, గాల్లో తేలిపోతున్నారు. ఇది అమెరికా నుంచి మన ఇండియా వరకు, అంతెందుకు మన హైదరాబాద్ వరకు విస్తరించటం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ సహా జీవీకే, జీఎంఆర్ గ్రూప్ సంస్థలకు సొంతంగా ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి. బంగారం విక్రయించే కొన్ని బడా సంస్థలకు కూడా సొంత జెట్ విమానాలున్నాయి.

యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని వార్తలు

గంటకు రూ 60,000...

గంటకు రూ 60,000...

సాధారణంగా విమానంలో దూరాన్ని బట్టి ఒక టికెట్ ధర రూ 3,000 నుంచి రూ 10,000 మధ్యలో ఉంటుంది. ఇండియా లో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలంటే ఇంతకంటే అధిక ధర చెల్లించాల్సిన పని ఉండదు. ఏవో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పితే రూ 10,000 కంటే అధిక ధర టికెట్ ఉండటం అరుదు. అయితే, సహజంగానే సంపన్నులు ఎకానమీ బదులు బిసినెస్ క్లాస్ ఎంచుకుంటారు కాబట్టి... టికెట్ ధర గరిష్టంగా రూ 30,000 వరకు ఉంటుంది. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ భయానికి అందరితో కలిసి ఒకే విమానంలో ప్రయాణించటం రిస్క్ అని భావిస్తున్న సంపన్నులు... తామే ప్రత్యేకంగా ఒక విమానాన్ని మాట్లాడుకుని వెళ్లిపోతున్నారు. దేశంలో ప్రైవేట్ జెట్లను అద్దెకు ఇచ్చే సంస్థలు చాలానే ఉన్నాయి. ఇవి ఒక్కో గంట ప్రయాణానికి రూ 60,000 వరకు చార్జీ వసూలు చేస్తాయి. విమానం సైజు, సీట్ల సంఖ్యను బట్టి ధర గంటకు రూ 6,00,000 వరకూ ఉంటుంది.

ఒక్క సీటు కూడా ...

ఒక్క సీటు కూడా ...

ప్రైవేట్ జెట్ విమానాలు ఒక సీటును కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తాయి. కానీ ధరలు అధికంగా ఉంటాయి కాబట్టి కనీసం నలుగురు, లేదా 10 మంది కోసం ఒక ప్రైవేట్ జెట్ బుక్ చేసుకుంటే బిజినెస్ ట్రావెల్ ఖర్చుకు దగ్గరగా ధరలుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో బయలు దేరి ఢిల్లీ వెళ్లాలంటే ఒక సీటుకు సుమారు రూ 8,00,000 చెల్లించాల్సి ఉండగా, అదే 10 మంది కోసం అయితే, సుమారు రూ 27 లక్షలు ఖర్చవుతోంది. అదే రౌండ్ ట్రిప్ అయితే ఖర్చు మరింతగా తగ్గిపోతుంది. ప్రైవేట్ జెట్ సేవలు అందిస్తున్న జెట్ సెట్ గో అనే సంస్థ ధరల పట్టిక కూడా దాదాపు ఇవే ధరలను సూచిస్తుండటం విశేషం. సంపన్న ఇండివిడ్యుల్స్, కంపెనీల యజమానులు, సీఈఓ లు, టాప్ లెవెల్ బిజినెస్ మేనేజర్లు ప్రైవేట్ జెట్లలో ప్రయాణిస్తున్నారని ఈ రంగ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.

25 బిలియన్ డాలర్ల నష్టం...

25 బిలియన్ డాలర్ల నష్టం...

కరోనా దెబ్బకు చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ లైన్స్ కంపెనీలు విపరీతమైన నష్టాలను చవిచూస్తున్నాయి. ఫ్లైట్ల లో ప్రయాణిస్తే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంది కాబట్టి... సామాన్యులు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. అటు ప్రభుత్వాలు కూడా అత్యవరం ఐతే తప్ప విదేశీ ప్రయాణాలు వద్దని సూచిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పడిపోయింది. సుమారు 15% మేరకు ప్రయాణికుల సంఖ్య తగ్గటంతో సుమారు 25 బిలియన్ డాలర్ల మేరకు నష్టాలు వచ్చాయి. ఇందులో సగం నష్టం ఒక్క చైనాలోనే రావటం గమనార్హం. ఇక సంపన్నులు ఇలా ప్రైవేట్ జెట్ల పై ఆధారపడుతుండటంతో ఇక ముందు నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో అని ఏవియేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+