Stocks In Focus: స్టాక్ మార్కెట్లలో రైస్ స్టాక్స్ ప్రస్తుతం ఉడుకున్నాయి. ఇవి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తున్నాయి. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ప్రజలకు ఆందోళనలు కలిగిస్తున్నప్పటికీ.. ఇన్వెస్టర్లకు మాత్రం కాసుల పంట కురిపిస్తోంది.
ప్రఖ్యాత రిసెర్చ్ ఏజెన్సీ ఫిచ్ సొల్యూషన్స్ నివేదికతో బియ్యం ఉత్పత్తి చేసే కంపెనీల షేర్లు ఏప్రిల్ 19న బలమైన లాభాలను నమోదు చేశాయి. రెండు దశాబ్దాల తర్వాత వాతావరణ మార్పుల కారణంగా బియ్యం ఉత్పత్తి ప్రభావితం కావటంతో ప్రపంచ మార్కెట్ అతిపెద్ద కొరతను ఎదుర్కోనున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ మహమ్మారి వంటి కారణాలతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సరఫరా అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి పడిపోవటానికి కారణమైంది. ఇదే సమయంలో రష్యాపై ఆంక్షలు విధించటంతో బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ క్రమంలో కిలో బియ్యం ధర రూ.5 నుంచి రూ.15 వరకు పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిచ్ అంచనాల ప్రకారం 2024 వరకు బియ్యం ధరలు గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉందని తెలిస్తోంది.

ఈ వార్తల నేపథ్యంలో.. ట్రేడింగ్ సమయంలో కేఆర్‌బీఎల్, ఎల్‌టీ ఫుడ్స్, కోహినూర్ ఫుడ్స్ షేర్లు భారీగా పెరిగాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి.. KRBL షేర్లు 10.02 శాతం పెరిగి రూ.377.50 వద్ద, ఎల్‌టి ఫుడ్స్ షేర్లు 6.09 శాతం పెరిగి రూ.104.40 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక కోహినూర్ ఫుడ్స్ షేర్లు 5 శాతం మేర పెరిగి NSEలో రూ.30.80 వద్ద ట్రేడవుతున్నాయి.
గత ఏడాది సెప్టెంబరులో దేశంలోని అనేక రాష్ట్రాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు కావటంతో ఉత్పత్తి తగ్గింది. ఈ క్రమంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. బియ్యం ఎగుమతిపై సుంకాలను పెంచింది. 2022లో భారత్.. థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్థాన్, అమెరికాల కంటే ఎక్కువ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసి రికార్డు సృష్టించింది.


Click it and Unblock the Notifications