Centre on rice: బియ్యం ఎగుమతులపై కేంద్రం గతంలోనే ఆంక్షలు విధించింది. అయినా అంతకంతకూ పెరుగుతూ పోతున్న బియ్యం ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
బియ్యం రిటైల్ ధరను తక్షణమే తగ్గించాలని రైస్ ఇండస్ట్రీ అసోసియేషన్‌లను కేంద్రం ఆదేశించింది. బాస్మతీయేతర బియ్యం ధరలను సమీక్షించడానికి ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రాను రంగంలోకి దింపింది. రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ ఖరీఫ్‌లో మంచి దిగుబడి, FCIలో పుష్కలంగా నిల్వలు, ఎగుమతులపై పరిమితులు ఉన్నప్పటికీ బియ్యం ధరల పెరుగదలపై ఆందోళన వ్యక్తం చేశారు.

గత రెండేళ్లుగా బియ్యం వార్షిక ద్రవ్యోల్బణం దాదాపు 12 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీయ మార్కెట్‌లో ధరలను సరైన స్థాయికి తగ్గించాలని కోరారు. ఈ ప్రయోజనాన్ని త్వరితగతిన వినియోగదారులకు అందజేయాలని సూచించారు. అదే సమయంలో లాభార్జనపై ఆచితూచి వ్యవహరించాలన్నారు. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
తగినంత స్థాయిలో నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉన్నట్లు రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమకు FCI స్పష్టం చేసింది. OMSS కింద రిజర్వ్ ధర కిలో 29 చొప్పున అందజేయగలమని వెల్లడించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సహేతుకమైన మార్జిన్‌తో వినియోగదారులకు విక్రయించేలా చర్యలు చేపట్టాలని కోరింది. తద్వారా రాబోయే రోజుల్లో బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications