Rice Prices Rising: సామాన్యుల ఆహారమైన గోధుమలు, గోధుమ పిండి ఇప్పటికే ఖరీదైనవిగా మారిపోయాయి. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇప్పుడు అన్నం వంతు వచ్చింది. మార్కెట్‌లో గత రెండు నెలలుగా బియ్యం ధరలు దాదాపు 30 శాతం పెరిగింది. గతంలో కిలో రూ.60కి లభించే బాస్మతి బియ్యం ఇప్పుడు రూ.80కి పెరిగింది. కిలో రూ.30కి లభించే విరిగిన బాస్మతి బియ్యం కూడా రూ.40కి తక్కువకు దొరకటం లేదు. అలాగే ఇతర రకాల బియ్యం రేట్లు కూడా గతంలోకంటే పెరిగాయి.

ఈ ఏడాది పెరిగిన ఎగుమతులు..
ఈ ఏడాది బియ్యం ఎగుమతులు అధికంగా ఉంటాయని ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ సెటియా అంచనా వేస్తోంది. బంగ్లాదేశ్ మన బియ్యానికి శాశ్వత కస్టమర్ కాదని వారు అంటున్నారు. బంగ్లాదేశ్ లో బియ్యం ప్రధాన ఆహారం. కానీ.. అక్కడ వరి పంట బాగా పండినప్పుడు భారత్ నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోదు. ఈ ఏడాది అక్కడి నుంచి బియ్యానికి గిరాకీ ఉంది. అందుకే బంగ్లాదేశ్ ప్రభుత్వం బియ్యంపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించింది. దీంతో భారత మార్కెట్‌లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.

చైనాతో పాటు మరికొన్ని దేశాలకు ఎగుమతులు..
ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేస్తున్న చైనా ప్రస్తుతం మన నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటోంది. విరిగిన బియ్యాన్ని కూడా చైనా దిగుమతి చేసుకుంటోంది. వీటిని పిండిగా మార్చి వంటకాల్లో వినియోగిస్తారని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ఇరాన్, సౌదీ అరేబియా నుంచి కూడా భారత బియ్యానికి డిమాండ్ బాగా పెరిగింది. బంగ్లాదేశ్ బాస్మతీయేతర బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుండగా, పశ్చిమాసియా దేశాల నుంచి ప్రధానంగా బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉంది.

దేశంలో తగ్గిన వరి సాగు విస్తీర్ణం..
దేశంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గింది. గత జూలై 29 వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి వరి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో విస్తీర్ణం తగ్గింది. అందుకే గతేడాదితో పోలిస్తే వరిసాగు మొత్తం 13.3 శాతం తగ్గింది. జూలై 29 వరకు తూర్పు, ఈశాన్య భారత్ లోని ఆరు రాష్ట్రాల్లో వరిసాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 37.70 లక్షల హెక్టార్లు తగ్గింది. ఒక హెక్టారులో సగటు దిగుబడి 2.6 టన్నులుగా లెక్కిస్తే.. వరి దిగుబడిలో 100 లక్షల టన్నుల తగ్గింనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

పెరిగిన బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు..
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2021-22 సంవత్సరంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసింది. వీటిలో 76 దేశాలకు ఒక మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 2019-20లో 2,015 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది 2020-21లో 4,799 మిలియన్ డాలర్లు, 2021-22లో 6,115 మిలియన్ డాలర్లకు పెరిగాయి. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 2021-22లో 27% వృద్ధిని నమోదు చేస్తూ 6,115 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వీటి ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్యం అన్ని వ్యవసాయ ఉత్పత్తుల కంటే అగ్రస్థానంలో ఉంది.

దేశంలో వరి పండిస్తున్న రాష్ట్రాలు ఇవే..
దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు అన్నం తింటారు. కానీ.. అన్నం ఎక్కువగా తినే రాష్ట్రాల్లో దీని సాగు కూడా ఎక్కువగానే ఉంది. దీనికి మినహాయింపులు పంజాబ్, హర్యానా.. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో రొట్టెలు ప్రధాన ఆహారం. కానీ ఎక్కువ ఆదాయం కోసం అక్కడి రైతులు సైతం వరినే సాగు చేస్తారు. దీంతో భూగర్భ జలాల దోపిడీ కూడా ఎక్కువైంది. దేశంలో బియ్యం ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అస్సాం, హర్యానా ఉన్నాయి.

వరదల కారణంగా..
ఈశాన్య రాష్ట్రాలు ఈరోజుల్లో వరదల్లో చిక్కుకున్నాయి. వరద ప్రభావం బంగ్లాదేశ్‌పై కూడా ఉంది. ఈ కారణంగా అక్కడ వరి పంట నాశనమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా.. అక్కడి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. దీని కారణంగా భారత్ లో బియ్యం ధర పెరిగింది. వాస్తవానికి జూన్‌లోనే దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. బియ్యంపై దిగుమతి సుంకాన్ని 62.5 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మనదేశం గోధుమల ఎగుమతిని నిషేధించినటంతో.. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై కూడా ఆంక్షలు తెస్తుందేమోనని బంగ్లాదేశ్ భయపడింది. ఇందులో భాగంగా ముందుగానే మన నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవటం ప్రారంభించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications