Bonus Multibagger: మల్టీబ్యాగర్ రాబడులిచ్చిన స్టాక్.. 11 బోనస్ షేర్లిస్తోంది..
Bonus Multibagger: గత కొంత కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు అస్థిర పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని కంపెనీల షేర్లు మాత్రమ బలమైన రాబడులను అందిస్తూ తమ ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేస్తున్నాయి. తాజాగా అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ ఒకటి బోనస్ షేర్లను ఉచితంగా అందిస్తోంది.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన రాబడులను అందించిన రెటాన్ టీఎమ్‌టీ కంపెనీ గురించే. ఆరు నెలలుగా తమ పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు స్టాక్ ఇప్పటికే 750 శాతం రాబడిని అందించింది. ఇదే సమయంలో అర్హులైన ఇన్వెస్టర్లకు 11 బోనస్ షేర్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్స్ లో వెల్లడించింది. దీనికి తోడు స్టాక్ స్ప్లిట్ కూడా చేయాలని Rhetan TMT నిర్ణయించింది.

రికార్డు తేదీ వివరాలు..
బోనస్ ఇష్యూ, స్టాక్ స్ప్లిట్ బోర్డు సమావేశంలో ఆమోదించబడినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో కంపెనీ వెల్లడించింది. అర్హత కలిగిన పెట్టుబడిదారులకు ప్రతి 4 షేర్లకు గాను 11 బోనస్ షేర్లను జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో 10 రూపాయలు ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేరును 10 భాగాలుగా విభజించనున్నట్లు తెలిపింది. కంపెనీ బోనస్ ఇష్యూ, స్టాక్ స్ప్లిట్ కోసం రికార్డ్ తేదీని మార్చి 10, 2023గా నిర్ణయించింది.

ప్రస్తుతం స్టాక్ ధర..
సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి రెటాన్ టీఎమ్‌టీ షేర్లు 0.38 శాతం పెరిగి రూ.511.05 వద్ద ఉన్నాయి. సెప్టెంబర్ 2022 నుంచి కంపెనీ పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. దీంతో ఇది టాప్ పెర్ఫార్మింగ్ IPOల జాబితాలో నిలిచింది. గత 6 నెలల్లో కంపెనీ షేరు ధర ఏకంగా 751.04 శాతం మేర పెరిగింది.


Click it and Unblock the Notifications