Hyderabad Real Estate: హైదరాబాద్ మహానగరం నుంచి విశ్వనగరంగా మారే ప్రక్రియలో ఉంది. నగరానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతున్న వేళ దానికి తగినట్లుగానే విస్తరణ కూడా అవసరమని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బెంగళూరులో జరిగిన తప్పులను ముందుగానే నివారించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాదు నగరాన్ని విస్తరించే క్రమంలో హెచ్ఎమ్డీఏ పరిధిని ప్రస్తుతం రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని నిర్ణయించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నగరాన్ని విస్తరించి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను వీలీనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాల విస్తరణకు అవసరమైన ప్రాజెక్టులు చేపట్టాలను సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే నగర శివారులోని 51 గ్రామాల విలీనం కూడా జరగబోతోంది. దీనికి అనుగుణంగా కొత్త వార్డుల రూపకల్పన కూడా జరగనుంది.

ప్రస్తుత ప్రణాళికలో భాగంగా 27 మున్సిపాలిటీలను విలీనం చేసేందుకు జలమండలి హైదరాబాద్ కోసం మాస్టర్ ప్లాన్ కింద రూ.17,212 కోట్లను కేటాయించనుందని వెల్లడైంది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపారు. అలాగే విలీనానికి అనుగుణంగా రోడ్లు రహదారులను సైతం రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరచాల్సి ఉండగా దీనికోసం చర్యలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ఓఆర్ఆర్ వరకు మాత్రమే ఉన్న గ్రోత్ కారిడార్ ఇకపై రీజినల్ రింగ్ రోడ్ వరకు పెరగనుంది.
భవిష్యత్తులో నగరానికి రానున్న ఐటీ, ఫార్మా, డిఫెన్స్ పరిశ్రమలకు అనుగుణంగా ప్రస్తుతం నగర విస్తరణ ప్రణాళికలు కొనసాగుతున్నాయని నిపుణులు, కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ చర్యలు నగరంలో కొత్త రియల్టీ బూమ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండలోని కొన్ని మండలాలు ఉన్ నసంగతి తెలిసిందే. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత హెచ్ఎండీఏ పరిధి దాదాపు 8 జిల్లాల్లోకి విస్తరించి ఉంది.
ప్రస్తుతం నగర విస్తరణ ప్రక్రియలో భాగంగా జీహెచ్ఎంసీని ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రెండు లేదా
అంతకంటే ఎక్కువ భాగాలుగా చేయటం ద్వారా నిర్వహణ సులభతరంగా మారటంతో పాటు పర్యవేక్షణ వెసులుబాట్లు కూడా ఉంటాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అయితే దీనికి ముందు ప్రతిపక్ష విపక్షాలు దీనిపై పెద్ద స్థాయిలోనే డిబేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెుత్తానికి నాలుగు రోజులు ఆలస్యం అయినప్పటికీ విస్తరణ నిర్ణయం కొన్ని ప్రాంతాల్లో రియల్టీ బూమ్ క్రియేట్ చేస్తోంది. నగర పరిధిలోకి కొత్త ప్రాంతాలు రావటం వల్ల అక్కడ ప్రాపర్టీల రేట్లు కూడా పెరుగుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications