Telangana Budget: రైతుల పక్షాన తెలంగాణ బడ్జెట్.. ఐటీ కేటాయింపులు ఇవే..!

Budget News 2024: తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో తాజాగా మెుదటి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశలెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.20 లక్షల కోట్లు ఉండగా.. మూలధన వ్యయం రూ.33.48 వేల కోట్లుగా ఉంది.

ప్రధానంగా తెలంగా బడ్జెట్లో 7 రంగాలకు భారీగా భట్టి కేటాయింపులు:
- ముందుగా వ్యవసాయానికి అత్యధికంగా రూ.72,659 కోట్లను కేటాయించి రైతుల ప్రభుత్వంగా రేవంత్ నిరూపించుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రం సైతం ఈ సారి వ్యవసాయం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే.
- ఇక రెండవ స్థానంలో ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లను కేటాయించగా దీని తర్వాత పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,816 కోట్లను కేటాయించారు.
- అలాగే నీటిపారుదల రంగానికి రూ.22,301 కోట్లు, విద్యకు రూ.21,292 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు, ట్రాన్స్కో డిస్కంలకు రూ.16,410 కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిలో ప్రవేశపెట్టిన రుణబీమా పథకానికి భట్టి రూ.50.41 కోట్లను కేటాయిస్తూ మహిళా సమాఖ్యలో సభ్యురాలు మరణిస్తే గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాఫీకి ఈ నిధి వినియోగించబడుతుందని పేర్కొన్నారు.
- హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోని అత్యున్నత ఐటి సేవలం కంపెనీలకు ప్రస్తుతం గమ్యస్థానంగా మారిన వేళ ఆ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.774 కోట్లను కేటాయించారు.

Revantah Reddy Gov In Telangana allocated big to Agri sector Know IT allocations

ఇల్లు లేని వారికి శుభవార్త:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సైతం తెలంగాణ ప్రభుత్వం భారీ కేటాయింపులను ప్రకటించింది. ఈసారి 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నట్లు భట్టి ప్రకటించారు. ఈ క్రమంలో లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవటానికి రూ.5 లక్షల ఆర్థిక సహకారం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. అయితే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఈ సాయం రూ.6 లక్షలుగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో ఒక్కో నియోజకవర్గాలనికి సగటున 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

రైతు కూలీలకు గుడ్‌న్యూస్:
ప్రస్తుతం గ్రామాల్లో భూమి లేని రైతులు రోజువారీ కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే వీరికి ఆర్థిక సాయం అందించేందుకు తమ ప్రభుత్వం అర్హులైన భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం అందించేందుకు కొత్త కార్యక్రమాన్ని ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీనిపై గ్రామాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..

● వ్యవసాయం ,అనుబంధ రంగాలకు- రూ.72,659
● హార్టికల్చర్- రూ.737
● పశుసంవర్ధక శాఖ- రూ.19080
● మహాలక్ష్మి పథకం- రూ.723
● గృహజ్యోతి- రూ.2418
● ప్రజాపంపిణీ వ్యవస్థ- రూ.3836
● పంచాయతీ రాజ్- రూ.29816
● మహిళా శక్తి క్యాంటిన్ - రూ.50
● హైదరాబాద్ అభివృద్ధి- రూ.10,000
● జీహెఎంసీ- రూ.3065
● హెచ్ ఎండీఏ- రూ.500
● మెట్రో వాటర్- రూ.3385
● హైడ్రా- రూ.200
● ఏయిర్ పోర్ట్ కు మెట్రో- రూ.100
● ఓఆర్ఆర్ - రూ. 200
● హైదరాబాద్ మెట్రో- రూ. 500
● ఓల్డ్ సిటీ మెట్రో- రూ.500
● మూసీ అభివృద్ధి- రూ.1500
● రీజినల్ రింగ్ రోడ్డు- రూ.1525
● స్త్రీ, శిశు సంక్షేమం - రూ.2736
● ఎస్సీ - రూ.33124
● ఎస్టీ సంక్షేమం- రూ.17056..
● మైనారిటీ సంక్షేమం- రూ.3000
● బీసీ సంక్షేమం- రూ.9200
● వైద్య ఆరోగ్యం- రూ.11468
● విద్యుత్- రూ.16410
● అడవులు ,పర్యావరణం- రూ.1064
● ఐటి- రూ.774
● నీటి పారుదల - రూ.22301
● విద్య- రూ.21292
● హోంశాఖ- రూ.9564
● ఆర్.అండ్.బి- రూ.5790

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+