రిటైర్మెంట్‌ హోమ్స్‌.. వృద్ధుల డ్రీమ్ హోమ్స్ .. పెద్దల కోసం ప్రత్యేక వసతులతో

చదువు, ఉద్యోగం కోసం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న రోజులివి. మరి, మన అనుకునే ఆత్మీయ పలకరింపులు లేని మలి వయసు పెద్దల పరిస్థితేంటి? భద్రత, ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయతలను కలబోసి పెద్దలందరికీ ఆసరాగా నిలుస్తున్నాయి రిటైర్మెంట్‌ హోమ్స్‌. ఒకే ఏజ్‌ గ్రూప్‌ పెద్దలందరిని ఒకే చోట నివాసితులుగా కలపడంతో పాటు ప్రాజెక్ట్‌ నిర్మాణం, వసతులు అన్నీ కూడా పెద్దల అవసరాలకు, అభిరుచులకు తగ్గట్టుగా తీర్చిదిద్దడమే రిటైర్మెంట్‌ హోమ్స్‌ ప్రత్యేకత.

 పెద్దల అవసరాలకు తగ్గట్టు గృహ నిర్మాణాలు .. రిటైర్మెంట్ హోమ్స్

పెద్దల అవసరాలకు తగ్గట్టు గృహ నిర్మాణాలు .. రిటైర్మెంట్ హోమ్స్

భాగ్యనగరంలో ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న పెద్దలందరినీ ఒకే చోటికి చేరుస్తున్నాయి రిటైర్మెంట్ హోమ్స్ . నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులతో పట్టుమని పదినిమిషాలు కూడా మాట్లాడే టైం కూడా లేని పిల్లలు నేటి రోజుల్లో ఆప్యాయత, అనురాగాల కోసం వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు తపన పడుతూ ఉంటారు. ఇక ఎవరూ పట్టించుకోకుండా ఉండడాన్ని వారు అసలే తట్టుకోలేరు. అలాంటి పెద్దలు అందరికోసం, వారి అవసరాలకు అభిరుచులకు తగినట్లుగా, అన్ని వసతులతో రిటైర్మెంట్ హోమ్స్ నిర్మించి ఇస్తున్నారు హైదరాబాద్లోని రియల్టర్లు.

ప్రతిరోజూ ఆహ్లాడమే , పండుగ వాతావరణమే .. పెద్దల అభిరుచికి తగ్గ కార్యక్రమాలు

ప్రతిరోజూ ఆహ్లాడమే , పండుగ వాతావరణమే .. పెద్దల అభిరుచికి తగ్గ కార్యక్రమాలు

రిటైర్మెంట్ హోమ్స్ లో మిగతా హోమ్స్ కి భిన్నంగా వారాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తారు. పుట్టిన రోజులు , పెళ్లి రోజులు, పండుగలు చాలా ఘనంగా జరుపుతారు. ఇక ఆలయాలు భక్తిపారవశ్యం మాట సరే సరి. ఇలా వారి అభిరుచికి తగినట్లుగా రిటైర్మెంట్ హోమ్స్ నిర్మిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, వారు కోరుకున్న అభిరుచులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తూ రిటైర్మెంట్ హోమ్స్ ద్వారా ఒకే ఏజ్ గ్రూప్ వారందరినీ ఒక చోటకు చేరుస్తున్నారు.

 ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ , నిరంతర పర్యవేక్షణ , ప్యానిక్ బజర్స్ .. ఇలా ఎన్నో సౌకర్యాలు

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ , నిరంతర పర్యవేక్షణ , ప్యానిక్ బజర్స్ .. ఇలా ఎన్నో సౌకర్యాలు

ఇంతకుముందు కూడా రిటైర్మెంట్ హోమ్స్ పేరుతో నిర్మించిన ప్రాజెక్టులు సక్సెస్ కావడంతో ఇప్పుడు చాలా మంది రిటైర్మెంట్ హోమ్స్ పై దృష్టి పెట్టారు.

వీల్ చైర్ వెళ్లేంత వెడల్పాటి డోర్లు, బాత్రూంలు , కారిడార్లు, హాల్లో గ్రాబ్ బార్స్ , ఇక ఎమర్జెన్సీ సమయంలో వినియోగించే ప్యానిక్ బజర్లు, జారి పడిపోకుండా ఉండే యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్ , చక్కనైన ఓపెన్ ప్లేస్, చెట్లు, రెస్టారెంట్, ఏసీ డైనింగ్ హాల్, ప్రతి ఇంట్లోనూ పనిమనుషులు, 24 గంటల సీసీ కెమెరాలు, వారి కోసం మెడిటేషన్ హాల్, వాకింగ్ ట్రాక్, లైబ్రరీ ఇలా అన్నీ ఉంటాయి.

ప్రతీ బ్లాక్ లో నర్సు , అటెండర్ .. హైదరాబాద్ లో వృద్ధుల నుండి ఈ ఇళ్ళకు ఆదరణ

ప్రతీ బ్లాక్ లో నర్సు , అటెండర్ .. హైదరాబాద్ లో వృద్ధుల నుండి ఈ ఇళ్ళకు ఆదరణ

ఇక ప్రతీ బ్లాక్ లో ప్రత్యేకించి నర్సు, ఒక అటెండర్ అందుబాటులో ఉంటారు. వృద్ధాప్యంలో వారి అవసరాలకు అభిరుచులకు తగినట్లుగా, రిటైర్మెంట్ హోమ్స్ నిర్మించి, కావలసిన వసతులను అందిస్తూ, వారి చివరి రోజుల్లో సంతోషంగా ఉండటం కోసం కావలసిన ఏర్పాటులన్నింటినీ చేస్తున్నాయి హైదరాబాద్ నిర్మాణరంగ సంస్థలు. ఇక వీటికి పెద్దవారి నుండి మంచి ఆదరణ లభిస్తోందని రియల్టర్లు చెబుతున్నారు. ఈ రిటైర్మెంట్ హోమ్స్ కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+