Retail Vs Quick Commerce: గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ రిటైల్ మార్కెట్లలో భారీ మార్పులు మెుదలయ్యాయి. ఈ క్రమంలో డీమార్ట్ వంటి పెద్ద రిటైల్ విక్రయ సంస్థలు సైతం క్విక్ కామర్స్ కంపెనీలతో పోటీ పడలేకపోతున్నాయి. ఈ క్రమంలో క్విక్ కామర్స్ వ్యాపారంలో ప్రస్తుతం పోటీపడుతున్న జొమాటో, స్విగ్గీ, జెప్టోలకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకోవటానికి చేస్తున్న పనులు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయని తెలుస్తోంది.
ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద రిటైల్ పంపిణీదారుల సమూహం, నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి ప్రధాన కంపెనీలకు చెందిన 4 లక్షల రిటైల్ పంపిణీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్(AICPDF) క్విక్ కామర్స్ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, జెప్టోపై దర్యాప్తు చేయాలని యాంటీట్రస్ట్ బాడీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోరింది. సదరు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లను అందించటంతో పాటు వస్తువులను కొన్న రేట్ల కంటే తక్కువకు విక్రయిస్తున్నట్లు వారు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

దశాబ్ధాలుగా దేశంలో కొనసాగుతున్న డిస్ట్రిబ్యూటర్ విధానాన్ని బైపాస్ చేస్తూ పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తుల రీచ్ పెంచుకునేందుకు నేరుగా క్విక్ కామర్స్ కంపెనీలకు సరఫరా చేస్తున్నాయని ఆందోళన్ వ్యక్తం చేశారు. ఇలాంటి తగ్గింపు ధరల కారణంగా సాంప్రదాయ చిల్లర వ్యాపారులు పోటీ పడటం లేదా మనుగడ సాగించడం అసాధ్యంగా మారుతుందని వారి లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అధిక స్థాయిలో ఉన్న చిల్లర వ్యాపారుల ప్రయోజనాలను కాపాడాలని, రక్షణ చర్యలను అమలు చేయాలని వారు సీసీఐని కోరారు.
ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో సహా దేశంలోని పెద్ద ఈ-కామర్స్ ప్లేయర్‌లు దోపిడీ ధరల ద్వారా స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు CCI దర్యాప్తు విభాగం ఆగస్టులో కనుగొన్న సంగతి తెలిసిందే. అయితే సీసీఐ ఆరోపణలను సదరు కంపెనీలు ఖండించాయి. ప్రస్తుతం ఇదే ఆరోపణలు క్విక్ కామర్స్ కంపెనీలపై వచ్చింది. వాస్తవానికి దేశంలోని క్విక్ కామర్స్ కంపెనీలు ప్రస్తుతం దేశంలోని అనేక నగరాల్లో తమ వినియోగదారులకు కిరాణాతో సహా అనేక వస్తువులను 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి.
ఈ సంవత్సరం దేశీయ క్విక్ కామర్స్ కంపెనీల్లో అమ్మకాలు 6 బిలియన్ డాలర్లకు మించి ఉండవచ్చని అంచనా వేయబడింది. ప్రస్తుతం దేశీయ క్విక్ కామర్స్ మార్కెట్ అమ్మకాల్లో బ్లింకిట్ 40 శాతం వాటాను హోల్డ్ చేస్తుండగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 30 శాతం, జెప్టో 30 శాతం మార్కెట్ కలిగి ఉన్నట్లు పరిశోధనా సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications