DMart News: దంచికొట్టిన డీమార్ట్ లాభాలు.. Q2లో 18.5 శాతం పెరిగిన ఆదాయం..
DMart Q2 Results: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, బిలియనీర్ రాధాకిషన్ దమానీ కంపెనీ భారీ లాభాలను నమోదు చేసింది. డీమార్ట్ పేరుతో దుకాణాలను నడుపుతున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ తన రెండవ త్రైమాసిక ఫలితాలతో ఇన్వస్టర్లను సంతోషంలోకి నెట్టింది.
సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 18.51 శాతం పెరిగి రూ.12,307.72 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కేవలం రూ.10,384.66 కోట్లుగా ఉంది. పాజిటివ్ ఆదాయాల నేపథ్యంలో ఉదయం 10 గంటల సమయంలో స్టాక్ ఎన్ఎస్ఈలో 2 శాతం మేర లాభపడి రూ.3,800 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-100 మంది కుబేరుల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దమానీ విలువ 17.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఆయన 97వ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఆయన నేతృత్వంలోని రిటైల్ దుకాణాల చైన్ దేశవ్యాప్తంగా 336 స్టోర్లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, NCR, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తన స్టోర్లను నిర్వహిస్తోంది.
ప్రస్తుతం డీమార్ట్ షేర్లకు సిటీ బ్యాంక్ సెల్ రేటింగ్ ఇచ్చింది. దీనికోసం టార్గెట్ ధరను రూ.3,060గా నిర్ణయించింది. పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని బ్రోకరేజ్ వెల్లడించింది. ప్రతి చదరపు అడుగుల ఆదాయం నాసిరకం ఉత్పత్తి మిక్స్ ద్వారా ప్రభావితమవుతుందని భావిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో చిన్న పట్టణాల్లో 9 స్టోర్లను తెరిచింది. ఆదాయాల చుట్టూ ఉన్న రిస్క్ కారణంగా ప్రస్తుత వాల్యుయేషన్‌పై జాగ్రత్తగా ఉంటున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications