Investment Ideas: బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు అంశాలపై కీలక ప్రకటనలు చేసింది. దీనిలో మోదీ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం దేశంలోని స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు లాభాల పంట కురిపించబోతోంది.
పీఎం ఈ-బస్ సర్వీస్ కింద 10,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను నడపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం కేంద్రం దాదాపు రూ.57,613 కోట్లను వెచ్చించనుంది. దేశంలోని 100 ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపటానికి ఇది తీసుకురావటం జరిగింది. కేంద్రం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం కొన్ని కంపెనీలకు వరంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. PM-eBus సేవా కింద 10 సంవత్సరాల పాటు బస్సు ఆపరేటర్లకు ప్రభుత్వ మద్దతు కూడా అందించబడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ బస్సులను పిపిపి మోడల్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడైంది. ఇందుకోసం బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ప్రైవేట్ కంపెనీలకు సువర్ణావకాశం లభించనుంది. ఈ పథకం 2037 వరకు అమలులో ఉంటుంది. దీంతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ఉన్న JBM Auto Ltd, Olectra greentech కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల ఫోకస్ పెరిగింది. దీంతో మార్కెట్లు భారీ పతనంలో ఉన్నప్పటికీ ఈ కంపెనీల్లో మాత్రం నష్టపోకుండా ప్లాట్ ముగింపును చూశాయి. JBM ఆటో కంపెనీ స్టాక్ నిన్న మార్కెట్ ముగిసే సమయానికి 12 శాతం దూసుకెళ్లింది.

JBM ఆటో లిమిటెడ్ 2018లో ఎలక్ట్రిక్ బస్సుల తయారీలోకి ప్రవేశించింది. దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ 1,000కు పైగా ఎలక్ట్రిక్ బస్సులను పంపిణీ చేసింది. 110కి పైగా ఫాస్ట్ ఛార్జర్‌లను అమర్చింది. ఇదే క్రమంలో భవిష్యత్తు వ్యాపారం కోసం EV ప్రాజెక్ట్‌ల్లో రూ. 800 కోట్లను పెట్టుబడి పెట్టింది. అలాగే తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి రాబోయే మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.


Click it and Unblock the Notifications