IPO News: ఈవారం ఐపీవోల క్యూ.. విజయ్ కేడియా, ఆశిష్ ఖచోలియా కంపెనీల ఐపీవోలు..
Upcoming IPOs: కరోనా కాలం నుంచి మెుదలైన ఐపీవోల కోలాహలం నిరంతరాయంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతూనే ఉంది. దాదాపు ప్రతి నెల పదుల సంఖ్యలో కొత్త కంపెనీలు లిస్టింగ్ కోసం ఎక్స్ఛేంజీలకు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిలో అధిక భాగం పెట్టుబడిదారులను ధనవంతులుగా మార్చటంతో బెట్టింగ్ వేసేవారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
ఈ వారం ప్రైమరీ మార్కెట్‌లో దాదాపు 13 కంపెనీల ఐపీవోలు సబ్‌స్క్రిప్షన్ కోసం క్యూలో ఉన్నాయి. ఈ జాబితాలో SRM కాంట్రాక్టర్లు, ట్రస్ట్ ఫిన్‌టెక్, బ్లూ పెబుల్, TAC, వృద్ధి ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీలు ఉన్నాయి. దీనితో చాలా మంది రిటైల్ పెట్టుబడిదారులు బెట్టింగ్ వేసేందుకు డబ్బును సిద్ధంగా ఉంచుకున్నారు.

మెయిన్‌బోర్డ్ నుంచి SRM కాంట్రాక్టర్స్ కంపెనీ ఐపీవో మార్చి 26 నుంచి మార్చి 28 వరకు తెరవబడుతోంది. దీని ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధర రూ.200-210గా కంపెనీ నిర్ణయించింది. ఐపీవోలో 62 లక్షల షేర్ల తాజా ఇష్యూ ద్వారా రూ.130.2 కోట్లను సమీకరించాలని సంస్థ నిర్ణయించింది. ఇదే క్రమంలో SME విభాగంలో.. బ్లూ పెబుల్, ఆస్పైర్ & ఇన్నోవేటివ్ అడ్వర్టైజింగ్, ట్రస్ట్ ఫిన్‌టెక్, వృద్ధి ఇంజనీరింగ్ వర్క్స్, GConnect లాజిటెక్ అండ్ సప్లై చైన్ మార్చి 26న తెరవబడి మార్చి 28న ముగుస్తాయి.
ఈ క్రమంలో మార్కెట్లోకి ప్రముఖ ఇన్వెస్టర్లు ఆశిష్ కచోలియా-మద్దతుగల రేడియోవాలా నెట్‌వర్క, విజయ్ కేడియా-మద్దతుగల TAC ఇన్ఫోసెక్ మార్చి 27న తెరవబడి ఏప్రిల్ 2 వరకు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరచి ఉంటాయి. TAC Infosec ఐపీవో బుధవారం మార్చి 27న బిడ్డింగ్ కోసం తెరవబడుతుంది. కంపెనీ దాని ప్రైస్ బ్యాండ్‌ని ఒక్కొక్కటి రూ.100-106గా నిర్ణయించింది. ఇదే సమయంలో రేడియోవాలా ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.14.25 కోట్లను సేకరించాలని నిర్ణయించింది. మెుత్తానికి రానున్న వారం దలాల్ స్ట్రీట్ ఐపీవోల రద్దీని ఎదుర్కోనుంది. ఇన్వెస్టర్లు సైతం దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications