CPI News: అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇండియాను కలవరపరచే ఇబ్బంది ద్రవ్యోల్బణం. కేంద్రం సహా ఆర్బీఐ ప్రస్తుతం దీనిని అదుపులోకి తెచ్చేందుకే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశిత పరిధికి మించి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్ఠ స్థాయికి చేరినట్లు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) తెలిపింది. ఏకంగా 5.69 శాతం వద్ద స్థిరపడినట్లు వెల్లడించింది. పప్పులు, కూరగాయలు వంటి ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమంటూ డేటా విడుదల చేసింది. .

పరిశ్రమల ఉత్పత్తి సూచిక (IIP) కూడా నవంబర్‌లో 8 నెలల కనిష్ట స్థాయి 2.4 శాతానికి పడిపోయింది. నెల క్రితం 11.6 శాతంగానూ, ఏడాది పూర్వం ఇది 7.6 శాతంగానూ ఉందని NSO డేటా చెబుతోంది. తయారీ, మైనింగ్ మరియు మూలధన వస్తువుల ఉత్పత్తి కూడా వృద్ధి మందగించడానికి కారణమని పేర్కొంది.
వినియోగదారుల ఆహార ధరల సూచిక ప్రకారం వార్షిక ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 8.70 శాతం మరియు ఏడాది క్రితం 4.19 శాతం ఉంది. ఇక డిసెంబర్లో ఇది 9.53 శాతానికి పెరిగింది. డిసెంబర్లో పట్టణ ప్రాంతాల్లో రెండంకెల మేర 10.42 శాతం ఆహార ద్రవ్యోల్బణం నమోదు కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో 8.49 శాతంగా రికార్డయింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications