దేశీయ రిటైల్ ద్రవ్యోల్భణం నవంబర్ నెలలో మళ్లీ పెరిగింది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) నవంబర్ 2021లో 4.91 శాతానికి పెరిగింది. గత నెలలో సీపీఐ ఈ మేరకు నమోదైనట్లుగా జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) వెల్లడించింది. ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ ద్రవ్యోల్భణం పెరిగినట్లు తెలిపింది. అక్టోబర్ నెలలో ఏడాది ప్రాతిపదికన ఇది 4.48 శాతంగా నమోదయింది. అయితే నవంబర్ 2020లో మాత్రం 6.93 శాతం నమోదయింది. ఏడాది ప్రాతిపదికన మాత్రం తక్కువే.
ఆహార పదార్థాల ధరలు, ముఖ్యంగా కూరగాయల ధరలు పెరిగినట్లు ప్రభుత్వ డేటా వెల్లడిస్తుంది. ఓవరాల్ కన్స్యూమర్ ఫ్డు ప్రైస్ ఇండెక్స్(CFPI) 1.87 శాతం పెరిగింది. అంతకుముందు నెల (అక్టోబర్)లో ఇది 0.85 శాతంగా నమోదయింది. CFPI, CPI ఆధారిత ద్రవ్యోల్భణం నవంబర్ నెలలో గ్రామీణ ప్రాంతంలో కంటే పట్టణ ప్రాంతంలో గరిష్టంగా నమోదయింది. దీంతో పట్టణ ప్రాంతంలో రిటైల్ ద్రవ్యోల్భణం 5.54 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతంలో 4.29 శాతం నమోదయింది.

ఆహార ద్రవ్యోల్భణం పట్టణ ప్రాంతంలో 3.33 శాతానికి పెరగగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.09 శాతంగా నమోదయింది. అయితే వరుసగా ఐదో నెల రిటైల్ ద్రవ్యోల్భణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) టార్గెట్ 6 శాతం కంటే దిగువన ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం వరకు రిటైల్ ద్రవ్యోల్భణం పెరుగుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆ తర్వాత దిగి వస్తుందని పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications