Inflation: దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం.. 4.45 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం..
దేశంలో క్రమంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. జూలైలో 2026లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.45 శాతానికి పెరిగింది. ఇది జూన్‌లో ఇది 4.38 శాతంగా ఉంది. గత నెల రోజుల్లోనే స్వల్పంగా పెరుగుదల నమోదు అయింది. ముఖ్యంగా ఆహార ధరలు పెరగడం ఈసారి ద్రవ్యోల్బణ పెరుగుదలకు కారణమైంది.కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4 శాతం మధ్యకాలిక లక్ష్యానికి పైనే కొనసాగింది. మార్కెట్ అంచనా 4.50 శాతం కాగా.. ప్రభుత్వ గణాంకాలు దానికి దాదాపు దగ్గరగానే వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4.84 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 3.96 శాతానికి పెరిగింది.
ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 5.32 శాతం ఉండగా, జూలైలో 5.52 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరలు భారీగా పెరగడం వంటింటి బడ్జెట్‌పై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లి ద్రవ్యోల్బణం ఏకంగా 22.54 శాతానికి చేరగా, వెల్లుల్లి ధరల పెరుగుదల 35.36 శాతంగా, అల్లం 83.62 శాతంగా నమోదైనట్లు గణంకాలు చెబుతున్నాయి. అయితే అన్ని కూరగాయల ధరలు పెరగలేదు. బంగాళాదుంప, బెండకాయ, బఠానీలు, టమాటాల్లో ధరల తగ్గుదల కనిపించిందిి. అంటే మార్కెట్‌లో ఆహార ధరల పరిస్థితి ఒకేలా కాకుండా, వస్తువును బట్టి మారింది. ఎల్బీజీ గ్యాస్ ధర పెరగడం కూడా ద్రవ్యోల్బణం పై ప్రభావాన్ని చూపింది.

అంతే కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. అందుకే ట్రాన్స్ పోర్ట్ పై ప్రభావం పడి ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణంగా చెప్పుకోవచ్చు. రెస్టారెంట్లు, పర్సనల్ కేర్ వంటి సేవల ధరలు కూడా వినియోగదారులకు అదనపు భారాన్ని మోపాయి.రవాణా ద్రవ్యోల్బణం 4.43 శాతానికి పెరిగింది, రెస్టారెంట్, వసతి సేవల్లో ద్రవ్యోల్బణం 7.72 శాతంగా ఉంది. పర్సనల్ కేర్, సోషల్ సేఫ్టీ, ఇతర వస్తువులు-సేవల విభాగంలో ద్రవ్యోల్బణం ఏకంగా 14.77 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఇతర వ్యక్తిగత వస్తువుల ధరలు 43.54 శాతం పెరగడం దీనిపై ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు.
కేవలం కూరగాయలు, నిత్యావసర వస్తువులే కాదు.. బయట తినడం, తిరగటం, వ్యక్తిగత అవసరాలు వంటి ఖర్చులు కూడా ప్రజల బడ్జెట్‌ను పెంచాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ..ఆర్బీఐ మాత్రం వడ్డీ రేట్లను మార్చ లేదు. ద్రవ్యోల్బణం ఇంకా పెరిగితే ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications