దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. 2022 డిసెంబర్ శంలో ధరలు తగ్గి, రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. నవంబర్ లో 5.88 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్ లో 5.72 శాతానికి తగ్గింది. ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడమే ఇందుకు కారణమని గురువారం విడుదలైన అధికారిక గణాంకాల్లో పేర్కొన్నారు. డిసెంబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ.. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 5.66 శాతంతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువగానే ఉంది.

6 శాతం
ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 6 శాతం లక్ష్యానికి అనుగుణంగా వరుసగా రెండో నెలా 6 శాతం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. మే నెల నుంచి వరుసగా వడ్డీరేట్లు పెంచుతూ వస్తున్న ఆర్‌బీఐ.. రేట్ల పెంపును తక్కువగా చేసే అవకాశం ఉంది. దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గత ఏడాది నవంబర్‌లో ఐదు నెలల గరిష్ఠాన్ని తాకుతూ 7.2 శాతం వృద్ధిని కనబర్చింది.

పారిశ్రామిక ఉత్పత్తి
ఆహారం, ఇంధనం మినహా ప్రధాన ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 6. 1% వద్ద స్థిరంగా ఉందని, ఆందోళనకు మూలంగా కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7. 1% పెరిగి, అక్టోబర్‌లో 4. 2% తగ్గి మళ్లీ కోలుకున్నట్లు ప్రత్యేక డేటా చూపించింది. నవంబర్ 2021లో ఇది 1% పెరిగింది. నవంబర్‌లో తయారీ రంగం 6. 1 శాతానికి పెరిగింది.

యూఎస్ ద్రవ్యోల్బణం
పెట్టుబడి కార్యకలాపాల అంచనాగా పరిగణించబడే క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ నవంబర్‌లో 20. 7% పెరిగింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ నాన్ డ్యూరబుల్స్ రంగం పెరిగింది. అటు యూఎస్ లో కూడా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గురువారం విడుదలైన అమెరికా సీపీఐ డేటా ప్రకారం
డిసెంబర్‌లో US ద్రవ్యోల్బణంకనిష్ట స్థాయి 6.5 శాతానికి పడిపోయింది. గరిష్ఠం నుంచి ఆరోవసారి క్షీణతను నమోదు చేసింది. 2022లో గరిష్ట ఉన్న ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ వస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications