Inflation: ప్రపంచ దేశాలకు ధీటుగా భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో సైతం వృద్ధిరేటు మందగించగా.. ఇండియా మాత్రం తన దూకుడు కొనసాగిస్తూనే ఉంటుందని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. కానీ ద్రవ్యోల్బణం రూపంలో మాత్రం కొంత ఇబ్బంది వెంటాడుతూనే ఉంది. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి, సరఫరా వ్యవస్థలో భారీ అంతరాల కారణంగా.. RBI ముందస్తు అంచనా కంటే కొంత ఎక్కువగానే ఉంటోంది.

రెండోసారి బెంచ్ మార్క్ కు ఎగువే
ఫిబ్రవరి నెలకుగాను దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతం ఉన్నట్లు గణాంకాల శాఖ సోమవారం ప్రకటించింది. గత నెలలోని 6.52 శాతంతో పోలిస్తే కొంతమేర పరిస్థితి చక్కబడినట్లు వెల్లడించింది. అయితే వరుసగా రెండోసారి సైతం RBI బెంచ్ మార్క్ కి ఎగువనే ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది.
దీనికి తోడు 3 నెలల గరిష్ఠమైన 6.52కి పెద్ద దూరం లేకపోవడమూ ఇబ్బందికరమే. తద్వారా వడ్డీరేట్లను పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో గత ఏడేళ్లలో అత్యధిక వడ్డీరేట్లు రికార్డు అయ్యే ప్రమాదమూ ఉంది.

మార్చి నుంచి తగ్గవచ్చు
ఇక ఆహార ద్రవ్యోల్బణం విషయానికొస్తే, గత నెలలో 5.95 శాతం నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. జనవరిలో రికార్డ్ అయిన 5.94 శాతంతో పోలిస్తే పెద్ద తేడా ఏమీ కనిపించలేదు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI)లో దీనికి 39 శాతానికిపైగా వెయిటేజీ ఉందన్న విషయాన్ని గమనించాల్సి ఉంది.
మార్చిలో CPI ద్రవ్యోల్బణం 6 శాతానికి, రానున్న నెలల్లో 5 శాతానికి తగ్గుతూ పోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చేనెలలో వడ్డీరేట్లను RBI మరో 25 బేస్ పాయింట్లు పెంచనున్నట్లు MOFSL గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ నిఖిల్ గుప్తా అభిప్రాయపడ్డారు.

RBI రేట్ల పెంపు తప్పకపోవచ్చు
"ముందుగా భయపడినట్లుగానే CPI ద్రవ్యోల్బణం వరుసగా రెండోసారీ 6 శాతం పైగానే నమోదయింది. తృణధాన్యాలు, పాలు, పండ్లు, టొబాకో వంటి పలు వస్తువుల పెరుగుదల వల్ల కన్స్యూమర్ ఇండెక్స్ లో ఈ మేరకు తేడాలు వచ్చినట్లు ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. మానిటరీ పాలసీ కమిటీ మరోసారి రేట్ల పెంపు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అర్థమవుతోందన్నారు. అయితే రానున్న 3 వారాల్లో ఒకవేళ అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తే తప్ప RBI నిర్ణయంలో మార్పు ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications