మాకు గుడ్లు అక్కర్లేదు..! ఆగిపోయిన భారతీయ కోడిగుడ్ల ఎగుమతి.. రేట్లు తగ్గుతాయా..
ఇండియాలో కోళ్ల పరిశ్రమ ఎంత పెద్దగా ఉందొ అలాగే కోడి గుడ్ల పరిశ్రమ కూడా అంతే విస్తారంగా ఉంది. ఒక విధంగా ఇండియాలో గుడ్ల వాడకం ఎక్కువే. ప్రస్తుతం దేశంలో ఒక కోడి గుడ్డు సుమారు రూ.6 నుండి రూ.7 పలుకుతుంది. అయితే మన దేశం నుండి ఇతర దేశాలకు కూడా కోడి గుడ్ల ఎగుమతి అవుతుంది. తాజాగా ఇండియా నుంచి గుడ్ల దిగుమతికి కొత్త అనుమతులను ఒమన్ నిలిపివేసింది. దీంతో తమిళనాడులోని నమక్కల్‌లోని కోళ్ల పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఖతార్ దేశం తాజాగా భారతీయ గుడ్లపై బరువు ఆంక్షలు విధించింది. దింతో అక్కడ ఇప్పుడు నిషేధం విధించారు. డీఎంకే ఎంపీ కేఆర్‌ఎన్ రాజేష్‌కుమార్ మంగళవారం రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. భారత్ నుంచి గుడ్ల దిగుమతులను పునఃప్రారంభించేందుకు ఒమన్, ఖతార్ అధికారులతో చర్చించాలని కేంద్రాన్ని కోరారు. కోళ్ల పెంపకందారులు, గుడ్ల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు భారతదేశంలోని ఒమన్ అలాగే ఖతార్ రాయబారులతో సమావేశాలను కోరినట్లు రాజేష్‌కుమార్ తెలిపారు.
ఒమన్ ఆంక్షల కారణంగా ప్రస్తుతం కనీసం రూ. 15 కోట్ల విలువైన భారతీయ గుడ్లు పెద్ద మొత్తంలో నిలిచిపోయాయని నామక్కల్‌కు చెందిన గుడ్డు ఎగుమతిదారులు, లైవ్‌స్టాక్ అండ్ అగ్రి-ఫార్మర్స్ ట్రేడ్ అసోసియేషన్ (లిఫ్ట్) ప్రధాన కార్యదర్శి పివి సెంథిల్ తెలిపారు. సోహార్ పోర్ట్‌లో భారతీయ గుడ్ల కంటైనర్‌లను అన్‌లోడ్ చేయడానికి ఒమాన్ దిగుమతిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నమక్కల్ నుండి ఎగుమతిదారుల ప్రకారం, రెండు ప్రముఖ దిగుమతి దేశాలైన ఒమన్, ఖతార్ చర్యల కారణంగా గుడ్ల ఎగుమతి వ్యాపారం భారీగా తగ్గింది. దింతో దేశంలో కోడి గుడ్ల ధరలు మరింత తగ్గుతాయా లేదా అనేది ప్రశ్నార్ధంగా ఉంది.

తగ్గిన గుడ్ల ఎగుమతులు
కాన్సులేట్ స్థాయిలో పలు సమావేశాల తర్వాత ఒమన్ సెప్టెంబరులో పరిమితులతో దిగుమతులను తిరిగి ప్రారంభించింది. తాజాగా మంగళవారం ఒమన్ మళ్లీ భారతీయ గుడ్ల పై దిగుమతి అనుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) నుండి వచ్చిన డేటా ప్రకారం ఒమన్, ఖతార్, దుబాయ్, అబుదాబి, మస్కట్, మాల్దీవులు, శ్రీలంకతో సహా వివిధ దేశాలకు ఈ సంవత్సరం ప్రారంభంలో 114 మిలియన్ గుడ్ల ఎగుమతి జరిగింది. అయితే జూన్ నాటికి ఈ సంఖ్య 2.6 కోట్లకు పడిపోయింది. జూన్ నుంచి ఈ సంఖ్య కోటి కంటే తక్కువకు తగ్గిందని ఎన్‌ఈసీసీ అధికారి ఒకరు తెలిపారు.


Click it and Unblock the Notifications