Bengaluru News: బెంగళూరు వాసులకు హెచ్చరిక.. ఐదు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..!
బెంగళూరు వాసులను పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైన సమస్య ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ సమస్యతో బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ట్రాఫిక్ సమస్యలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు భద్రతాపరమైన ఆందోళనలు, సులభంగా ట్రాఫిక్ సాగేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు (BTP) నగరంలోని ఐదు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లపై కొన్ని రకాల వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షలు మైసూరు రోడ్డులోని బీజీఎస్ (సిర్సీ సర్కిల్) ఫ్లైఓవర్, పీణ్య ఫ్లైఓవర్, ఎలక్ట్రానిక్స్ సిటీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే, సిల్క్ బోర్డ్, రాగిగుడ్డ మధ్య ఉన్న మెట్రో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, సంజీవనగర్ క్రాస్, విద్యాశిల్ప్ జంక్షన్ మధ్య ఉన్న బళ్లారి రోడ్ (ఎయిర్‌పోర్ట్ రోడ్) ఫ్లైఓవర్‌లకు వర్తిస్తాయి.
సిర్సీ సర్కిల్, పీణ్య, డబుల్ డెక్కర్, ఎయిర్‌పోర్ట్ రోడ్ ఫ్లైఓవర్లపై ఆంక్షలు సెప్టెంబర్ 4 నుంచి అమల్లోకి వస్తాయి. ఎలక్ట్రానిక్స్ సిటీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆంక్షలు సెప్టెంబర్ 11 నుంచి అమలు చేయనున్నారు.
సిర్సీ సర్కిల్ ఫ్లైఓవర్‌పై భారీ సరుకు రవాణా వాహనాలను 24 గంటలూ నిషేధిస్తారు. మూడు చక్రాల గూడ్స్ ఆటోరిక్షాలతో సహా ఇతర సరుకు రవాణా వాహనాలను ఉదయం 7 నుంచి 11 గంటల వరకు అనుమతి లేదు. అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి లేదు. పీణ్య ఫ్లైఓవర్‌పై ప్రయాణికుల ఆటో-రిక్షాలు, మూడు చక్రాల గూడ్స్ ఆటోరిక్షాలను 24 గంటలూ నిషేధించారు. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో భారీ, మధ్యతరహా గూడ్స్ వాహనాలను నియంత్రిస్తారు.

ఎలక్ట్రానిక్స్ సిటీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భారీ, మధ్యతరహా, తేలికపాటి గూడ్స్ వాహనాలన్నింటినీ నిషేధిస్తారు. ద్విచక్ర వాహనాలు, ప్రయాణికుల ఆటో-రిక్షాలు, మూడు చక్రాల గూడ్స్ ఆటోరిక్షాలను 24 గంటలూ అంక్షలు విధించారు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌పై భారీ గూడ్స్ వాహనాలపై 24 గంటల నిషేధం ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్‌పై ద్విచక్ర వాహనాలు, ఆటో-రిక్షాలను 24 గంటలూ నిషేధిస్తారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని రకాల గూడ్స్ వాహనాలను నియంత్రిస్తారు.
ఫ్లైఓవర్లపై వాహనాల వేగంలో తేడాల కారణంగా జరిగిన ప్రమాదాలపై సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. రోడ్డు రూపకల్పన, వెడల్పు, ప్రమాద తీవ్రత, వాహనాలు పాడైపోవడం, ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద రద్దీ, అత్యవసర ట్రాఫిక్ నిర్వహణ, పాదచారులు, ద్విచక్ర వాహనదారుల భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications