ఫుడ్ డెలివరీ లో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్న స్విగ్గి, జొమాటో లకు చెక్ పడనుందా...? తాజా పరిణామాలను బట్టి చూస్తే అది నిజమేననిపిస్తోంది. ఈ రెండు కంపెనీలకు త్వరలోనే పెద్ద ఝలక్ ఎదురవబోతోందని సమాచారం. అది కూడా ఇప్పటి వరకు ఈ కంపెనీలు కలిసి పనిచేస్తున్న రెస్టారెంట్ల నుంచే కావటం గమనార్హం. దేశంలోని రెస్టారెంట్ల సంఘం నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ఒక సరికొత్త ప్రణాలికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
అదేమిటంటే... కస్టమర్లు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయటంతో పాటు దాని డెలివరీ కోసం ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది. తద్వారా స్విగ్గి, జొమాటో ల అధిపత్యానికి తెరదించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం అయినట్లు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అనురాగ్ కత్రియార్ లైవ్ మింట్ కు వెల్లడించారు. పలు రకాల డిజిటల్ కార్యక్రమాల ద్వారా తొలుత మా వ్యాపారాన్ని మా చేతిలోకి తీసుకునే ప్రయత్నం మొదలు పెట్టాం. ఇందుకోసం చిన్న పాటి బృందాలను కూడా ఏర్పాటు చేశాం అని అయన పేర్కొన్నారు. ఈ మేరకు లైవ్ మింట్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.

80% వారి చేతిలోనే...
దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి ఫుడ్ డెలివరీ చేసే విషయంలో స్విగ్గి, జొమాటో కంపెనీలే ముందు ఉంటున్నాయి. సుమారు 500 కి పైగా నగరాలు, పట్టణాల్లో తమ సేవలు అందిస్తూ దూసుకుపోతున్నాయి. దేశంలో మొత్తం ఫుడ్ డెలివరీ రంగంలో 80% వాటాను చేజిక్కించుకొని స్విగ్గి, జొమాటో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ, ఇక్కడే పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. హోటల్స్, రెస్టారెంట్ల నుంచి పెద్ద మొత్తంలో కమిషన్ వసూలు చేస్తున్నాయని, అలాగే వినియోగదారులు అసలు హోటల్స్ కు రాకుండా ఈ కంపెనీలు భారీ ఆఫర్లతో ఊరిస్తున్నాయని రెస్టారెంట్ల సంఘం ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది.
దీంతో తమ వ్యాపారాలు రెండు రకాలుగా దెబ్బతింటున్నాయని ఆరోపిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ఆప్ లకు అధిక కమిషన్ చెల్లించటం ద్వారా తమ లాభదాయకత దెబ్బతింటోందని, రెండోది ప్రతి ఆన్లైన్ ఆర్డర్ పై ఏదో ఒక ఆఫర్ ఉండటంతో వినియోగదారులు హోటల్స్ కు వెళ్లే బదులు ఆన్లైన్ లో ఆర్డర్లు చేస్తున్నారని వాటి వాదన. ఇప్పటికే అనేకసార్లు ఫుడ్ డెలివరీ ఆప్ లకు, రెస్టారెంట్ సంఘానికి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.

6,00,000 రెస్టారెంట్లు...
దేశంలో హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య పెద్ద మొత్తంలోనే ఉంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వద్ద 6,00,000 రెస్టారెంట్లు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అందుకే, ఈ సంఘానికి పెద్ద మొత్తంలో రెస్టారెంట్ల ను ఏక తాటిపైకి తెచ్చే సత్తా ఉంది. అందుకే, తమ సమస్యకు తామీ స్వయంగా పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేయాలని ఈ సంఘం భావిస్తోంది.
అందుకే, రెస్టారెంట్ల కోసం స్వయంగా తామే ఒక ఆన్లైన్ ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకుని, దాని ఆధారంగా ఆర్డర్లు తీసుకోవటం చేయాలని తలపిస్తోంది. అలాగే డెలివరీ కోసం ప్రత్యామ్నాయ సంస్థల కోసం వెతుకుతోంది. ఈ దిశగా పనిచేసేందుకు ఒక్కో విభాగానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం తగు పరిష్కారాలను వెతికి సంఘానికి నివేదిక అందిస్తుంది.

వాట్సాప్, పేస్ బుక్ లతో జట్టు...
ఈ ప్రయత్నంలో భాగంగా అవసరం అయితే సోషల్ మీడియా సంస్థలు ఐన పేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల సేవలను తీసుకోవాలని కూడా రెస్టారెంట్ల సంఘం భావిస్తోంది. డిజిటల్ విజిబిలిటీ కోసం ఇవి బాగా పనిచేయగలవని ఆశిస్తోంది. అలాగే తక్కువ ధరకే ఫుడ్ డెలివరీ చేయగలిగే సంస్థల కోసం వెతుకులాట మొదలు పెట్టింది. దీంతో, స్విగ్గి, జొమాటో లకు చెక్ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
లేదంటే, ఆ రెండు సంస్థలు చెప్పేదే వేదం అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇటీవల జొమాటో కాంటాక్ట్ లెస్ ఫుడ్ ఆర్దరింగ్ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. ఇది కస్టమర్లు హోటల్ కు వెళ్లిన తర్వాత ఆన్లైన్ లోనే మెనూ చెక్ చేసుకుని, ఆన్లైన్ లో ఆర్డర్ చేసి, ఆన్లైన్ లోనే పేమెంట్ చేసే వెసులుబాటును కల్పిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దీనిని ప్రవేశపెట్టింది. అయితే, ఇలాంటి సేవలు ఇంకెవరో ఇచ్చేంత వరకు వేచి చూడకుండా.. తామే స్వయంగా రూపొందించుకోవాలని అనురాగ్ పేర్కొన్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications