LPG Price: 4 మెట్లో నగరాల్లో తగ్గిన సిలిండర్ ధరలు.. లాభపడ్డ స్టాక్స్ ఇవే..!
LPG Price: దిల్లీతో సహా నాలుగు మెట్రో నగరాల్లో వాణిజ్య LPG సిలిండర్ల ధరల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు పెద్ద కోత విధించాయి. దీంతో నవంబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు అమలులోకి వచ్చాయి.
దేశంలోని చమురు కంపెనీలు కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధరను రూ.57.50 మేర తగ్గించాయి. ఇది ప్రత్యక్షంగా హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు వివిధ కమర్షియ గ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరటను అందించింది. వారు తమ ఖర్చులను తగ్గించుకోవటంలో దోహదపడింది. తగ్గిన ధరలను పరిశీలిస్తే.. దిల్లీలో రూ.1775.50, కలకత్తాలో రూ.1885.50, ముంబైలో రూ.1728, చెన్నైలో రూ.1942గా కొనసాగుతున్నాయి.

తాజా గ్యాస్ ధరల తగ్గింపు కొన్ని కంపెనీల షేర్లను పెంచాయి. వీటిని పరిశీలిస్తే.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, రెస్టారెంట్ బ్రాండ్స్(RBA), దేవయాని ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్, స్పెషాలిటీ రెస్టారెంట్స్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 3-20 శాతం వరకు లాభపడ్డాయి. ఇదే క్రమంలో చాలెట్ హోటల్స్, హెచ్‌ఎల్‌వీ, టీజీబీ బాంక్వెట్స్, ఓరియంటల్ హోటల్స్ వంటి హోటల్ స్టాక్‌లు 1-2 శాతం పెరగగా.. ఈఐసీ, మహీంద్రా హాలిడేస్, లెమన్ ట్రీ, ఇండియన్ హోటల్స్ 0.9 శాతం వరకు క్షీణించాయి.
తాజా నిర్ణయం తర్వాత చమురు కంపెనీల షేర్లు సైతం ప్రభావితం అయ్యాయి. HPCL షేర్లు 2.1 శాతం పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 400.5కి చేరగా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ స్టాక్ ధర 4.1 శాతం లాభపడి 52-కి చేరుకుంది. ఇదే క్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు సైతం పెరుగుదలను నమోదు చేశాయి.


Click it and Unblock the Notifications