IT News: ఫ్రెషర్స్ నెత్తిన IT బాంబ్.. అత్యంత దారుణంగా టెక్ కంపెనీల హైరింగ్ రేట్
IT News: గంపెడు ఆశలతో విద్యాభ్యాసం పూర్తిచేస్తున్న ఫ్రెషర్స్ కు దాదాపు గత రెండేళ్లుగా తీవ్ర నిరాశ ఎదురవుతోంది. దేశంలో అధిక శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న IT రంగం చతికిల పడటం ఇందుకు ప్రధాన కారణం. కాగా FY24లో ఈ ట్రెండ్ ఎలా ఉండనుందనే విషయంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
FY24 మొదటి అర్థభాగం ఇప్పటికే ముగిసింది. ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు సహా మరికొన్ని కంపెనీలు ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను పాజ్ చేశాయి. తద్వారా ఫ్రెషర్స్ నియామకంలో దాదాపు 65 శాతం తగ్గుదల నమోదు కావచ్చని స్టాఫింగ్ సంస్థ Xpheno తెలిపింది. ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో 35 శాతం క్షీణత చూడవచ్చని HR విశ్లేషకులు జూన్‌లోనే అంచనా వేశారు.

ఇన్ఫోసిస్, విప్రో వంటి IT సేవల సంస్థలు ఈ ఏఢాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ చేపట్టబోమని బహిరంగంగా ప్రకటించాయి. కాగా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలతో సహా ఇతర బిగ్ ప్లేయర్స్ నుంచి కూడా ఎటువంటి హైరింగ్ సూచనలు కనిపించడం లేదని అగ్ర ఇంజనీరింగ్ కళాశాలల ప్లేస్‌మెంట్ అధికారులు చెబుతున్నారు. కొన్ని కంపెనీలు రిక్రూట్ జరుపుతున్నా.. అంతంత మాత్రమేనని పేర్కొంటున్నారు.
H1FY24లో సుమారు 5 వేల 227 మంది ఫ్రెషర్‌లను జోడించినట్లు HCLTech తెలిపింది. ఏడాది క్రితం 16 వేల 362 నియామకాలను చేపట్టగా.. ఇప్పుడు అందులో కేవలం మూడవ వంతును మాత్రమే రిక్రూట్ చేసుకుంది. Q2FY24లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మొత్తం హెడ్‌కౌంట్ 6 వేల 333కు పడిపోయింది. కొంత ఆలస్యం అయినప్పటికీ, ఫ్రెషర్‌లకు అందించిన అన్ని ఆఫర్‌లను తాము గౌరవిస్తామని మాత్రం ప్రకటించింది.


Click it and Unblock the Notifications