ఎయిరిండియా తిరిగి టాటా సన్స్ చేతికి వస్తుండటంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ విమానయాన సంస్థ నుండి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో దేశంలో వ్యాపార వాతావరణం పూర్వవైభవాన్ని సంతరించుకోనుందని అభిప్రాయపడ్డారు. అప్పులలో కూరుకుపోయిన ఈ సంస్థను ప్రభుత్వం వదులుకోవడమే కాకుండా ప్రయివేటు రంగంపై ఉన్న విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తోందన్నారు. ఎయిరిండియా ప్రయివేటీకరణపై తన వ్యాఖ్యలు కాస్త అతిగా అనిపించే అవకాశముంది. కానీ ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా భారత వ్యాపార వాతావరణాన్ని రీసెట్ చేస్తున్నట్లుగా ఉందన్నారు.
'అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదులుకుంటోంది. అంతేకాదు, దశాబ్దాల తర్వాత ప్రయివేటురంగ సామర్థ్యంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎయిరిండియా టేకోవర్‌ను స్వాగతిస్తూ టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా చేసిన ట్వీట్‌ను ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌కు జత చేశారు.

కాగా, ఎయిరిండియా 68 సంవత్సరాల తర్వాత తిరిగి తన సొంత యాజమాన్యం చేతికి వెళ్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రయివేటీకరించేందుకు బిడ్డింగ్ నిర్వహించగా టాటా సన్స్ విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ఛైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. 'ఎయిరిండియాకు తిరిగి స్వాగతం' అని ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ మాజీ ఛైర్మన్ జేఆర్‌డీ టాటా ఎయిరిండియా విమానం నుండి దిగుతున్న ఫొటోను పోస్ట్ చేశారు.
ఎయిరిండియా కోసం టాటా గ్రూప్ బిడ గెలుచుకోవడం చాలా గొప్ప విషయమని, దీని పునర్నిర్మాణానికి గణనీయమైన కృషి అవసరమని అంగీకరిస్తున్నప్పటికీ ఈ పరిణామాలు విమానయాన పరిశ్రమలో టాటా గ్రూప్‌కు బలమైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తాయని విశ్వసిస్తున్నట్లు రతన్ టాటా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒకప్పుడు జేఆర్డీ టాటా నాయకత్వంలో ఎయిరిండియా ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విమానయాన సంస్థగా ఖ్యాతి గడించిందని, ఇప్పుడు ఎయిరిండియాకు అలాంటి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు టాటాలకు మళ్లీ అవకాశం లభించిందని, ఈ రోజు జేఆర్డీ టాటా మన మధ్యన ఉంటే ఎంతో ఆనందపడేవారని, ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు, వెల్‌కమ్ బ్యాక్, ఎయిరిండియా అని పేర్కొన్నారు.
బిడ్ మొత్తంలో ఎయిరిండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్స్ చెల్లించాలి. ఎయిరిండియా కోసం పలు సంస్థలు ఆర్థిక బిడ్స్ దాఖలు చేశాయి. స్పైస్ జెట్ అధినేత అజయ్ సింగ్ కూడా ఆర్థిక బిడ్ సమర్పించారు. ఎయిరిండియా నుండి ప్రభుత్వం వంద శాతం వాటాను ఉపసంహరించుకుంటోంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లోను 50 శాతం మొత్తాన్ని వదులుకుంటుంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ (AISATS) వాటాను 50 శాతం విక్రయిస్తోంది. బిడ్డింగ్ సందర్భంగా వేసిన కమిటీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలు ఉన్నారు.ఎయిరిండియా కొనుగోలు ద్వారా టాటాల చేతికి 4400 డొమెస్టిక్, 1800 ఇంటర్నేషనల్ ల్యాండింగ్స్ అండ్ పార్కింగ్ స్లాట్స్ అందుబాటులోకి వస్తాయి.
90 సంవత్సరాల క్రితం 1932లో ఎయిరిండియాను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో టాటా గ్రూప్ ప్రారంభించింది. 1953లో జాతీయీకరణ నేపథ్యంలో ప్రభుత్వం పరమైంది. ఆ తర్వాత 1977 వరకు నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 68 ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ టాటాల చేతికే వెళ్తోంది. డిసెంబర్ నాటికి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయి, టాటా సన్స్ చేతికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కలిపి ఆగస్ట్ డొమెస్టిక్ మార్కెట్ షేర్ 13.20 శాతంగా ఉంది. డెయిలీ డొమెస్టిక్ ఫ్లైట్స్ 180 నుండి 185 వరకు. కరోనాకు ముందు 200 కంటే ఎక్కువగా ఉన్నాయి. కరోనాకు ముందు 85 డొమెస్టిక్ డెస్టినేషన్స్‌కు కార్యకలాపాలు నిర్వహించింది. అలాగే 40 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. 15,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంలో, అంతర్జాతీయంగా ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పాసింజర్ ఫ్లైయింగ్ మార్కెట్ షేర్ 18.8 శాతంగా ఉంది. ఈ రెండు కలిపితే అతిపెద్ద వాటా ఎయిరిండియాదే. దేశీయ సంస్థల అంతర్జాతీయ మార్కెట్ షేర్ 39.2 శాతంగా ఉండగా, ఇందులో ఇండిగో 12.8 శాతం, ఎయిరిండియా 11.5 శాతం, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 7.3 శాతం, స్పైస్ జెట్ 5 శాతం, గోఎయిర్ 2.6 శాతంగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications