Old Pension Scheme: పాత పెన్షన్ విధానంపై ఆర్‌బీఐ కీలక హెచ్చరిక.. ఏమందంటే..??
Pension Scheme: అనేక రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చూస్తున్నాయి. దీనిపై అనేక చోట్ల రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల వేష వాగ్ధానాలు కూడా చేస్తున్నాయి.
ఇప్పటికే చాలా రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుండగా.. మరికొన్ని సైతం అదే దారిలో వెళ్లాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ పాత స్కీమ్ అమలు చేస్తుండగా.. కర్ణాటకలోనూ అమలు చేయనున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నివేదిక రాష్ట్రాలకు హెచ్చరించింది.

ఆర్‌బీఐ సోమవారం విడుదల చేసిన 'స్టేట్ ఫైనాన్స్: ఎ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 2023-24' నివేదికలో దీనిపై స్పందించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే.. వాటి ఆర్థిక భారం ఎన్‌పీఎస్‌తో పోలిస్తే 4.5 రెట్లు పెరుగుతుందని వెల్లడించింది. పాత పెన్షన్ స్కీమ్ ఖర్చుల అదనపు భారం 2060 నాటికి జీడీపీలో 0.9 శాతానికి పెరుగుతుందని నివేదిక పేర్కొంది.
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగి అభివృద్ధి పనులపై రాష్ట్రాల వ్యయం తగ్గుతుందని రిజర్వు బ్యాంక్ హెచ్చరించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్బీఐ ప్రముఖ వాగ్దానాల పేరుతో పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్రాలు అమలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు తమ తమ స్థాయిల్లో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను పరిశీలించాలని సూచించింది. రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీని పెంచడం ద్వారా రాష్ట్రాలు ఆదాయాన్ని పెంచుకోవడాన్ని పరిగణించాలని ఆర్‌బీఐ పేర్కొంది.
పాత పెన్షన్ అమలు చేయడం మంచి నిర్ణయం కాదని ఆర్‌బీఐ పేర్కొంది . దీంతో భావి తరాలు నష్టపోతాయనే భయం కూడా వ్యక్తమవుతోంది. నివేదిక ప్రకారం OPS చివరి బ్యాచ్ 2040 ప్రారంభంలో పదవీ విరమణ చేస్తారు. వారు స్కీమ్ కింద 2060 వరకు పెన్షన్‌ను అందుకుంటారని ఆర్బీఐ పేర్కొంది.


Click it and Unblock the Notifications