RBI New rules: ప్రజలు తమ ఆర్థిక అవసరాల కోసం క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు నిబంధనలను అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. తద్వారా వినియోగదారుల అధిక ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరిస్తుంది. తాజాగా వీటికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది.
క్రెడిట్ కార్డుల జారీ కోసం బ్యాంకులు మరియు నాన్-బ్యాంకులు అధీకృత కార్డ్ నెట్‌వర్క్‌లతో టైఅప్ కావడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాలు జారీ చేసింది. కార్డ్ నెట్‌వర్క్‌లు మరియు జారీచేసే సంస్థల మధ్య కొన్ని ఏర్పాట్లు వినియోగదారుల ఎంపికకు అనుకూలంగా లేవని తన సమీక్షలో గమనించినట్లు తెలిపింది.

జారీ చేయబడిన కార్డ్ ఏ నెట్‌వర్క్ కు చెందాలో ఆయా సంస్థలే నిర్ణయించడాన్ని సెంట్రల్ బ్యాంక్ తప్పుపట్టింది. ఈ కార్డ్ జారీదారులు నెట్‌వర్క్‌లతో కలిగి ఉన్న సంబంధాలపై ఆరా తీసిన అనంతరం పలు నిర్ణయాలు తీసుకుంది. అధీకృత కార్డ్ నెట్‌వర్క్‌లలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్, మాస్టర్ కార్డ్, రూపే మరియు వీసా లు ఉన్నాయని RBI వెల్లడించింది.
యూజర్లు ఇతర కార్డ్ నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా నిరోధించే కంపెనీలతో కార్డ్ జారీ చేసే సంస్థలు ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోకూడదని తేల్చి చెప్పింది. అర్హత కలిగిన కస్టమర్‌లకు కార్డు జారీ సమయంలో వివిధ నెట్‌వర్క్‌ల నుండి నచ్చిన దాన్ని ఎంచుకోవడానికి ఆఫ్షన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే కార్డ్ కలిగి ఉన్న వారు రెన్యువల్ సమయంలో ఇష్టం వచ్చిన నెట్‌వర్క్‌కు మారవచ్చని పేర్కొంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications