మనకు అత్యవసరంగా డబ్బు కావాల్సొస్తే వెంటనే బ్యాంకుకి వెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బు అవసరాన్ని తీర్చుకుంటాం. కానీ ఇక నుండి ఆలా జరగదు. ఎందుకంటే బ్యాంకులు అలాగే ఇతర నాన్ బ్యాంకింగ్ సంస్థల గోల్డ్ లోన్స్ పై ఆర్బీఐ కొరడా జూలిపించింది. దీనికి ఒక కారణం గోల్డ్ లోన్ ఇతర లోన్స్ తో పోల్చితే తక్కువ పేపర్ వర్క్ ఇంకా వేగంగా ఎక్కువ డబ్బు పొందవచ్చు. దీనికి పెద్దగా షూరిటీ కుడి అవసరం లేదు. అయితే గోల్డ్ లోన్ ప్రాసెస్ కఠినం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ నిబంధనలు పాటించడం లేదని బయటపడటంతో దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దేశంలో గోల్డ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి బంగారం ధర పెరగడంతో చాలా మంది నగలు, ఆభరణాలు తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితం కొన్ని కంపెనీలు గోల్డ్ లోన్ సాంక్షన్ చేయడంలో ప్రమాణాలను పాటించడం లేదని రిజర్వ్ బ్యాంక్ పసిగట్టింది. ముఖ్యంగా నిబంధనలను పాటించకుండా లోన్స్ అందించే బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాల కంపెనీలపై చర్యలు కూడా తీసుకున్నారు. గోల్డ్ లోన్స్ శాంక్షన్ చేయడంపై తాత్కాలిక నిషేధం కూడా విధించింది.
రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం గోల్డ్ లోన్ ప్రాసెస్ కఠినతరం చేయాలని యోచిస్తోందని బ్యాంకింగ్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రూల్స్ మరింత కఠినం చేయడానికి అలాగే అన్ని కంపెనీలు వాటిని ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాధారణ లోన్స్ కంటే గోల్డ్ లోన్స్ సెక్టార్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో దీనిని అరికట్టడానికి ఒక ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్స్ శాంక్షన్స్ చేసే ముందు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. తాకట్టు పెడుతున్న బంగారం నిజంగా వారిదేనా, లోన్ తీసుకున్నకా వచ్చే డబ్బు దేనికి ఉపయోగిస్తారు ? లోన్ తిరిగి కట్టకపోతే బంగారం వేలం వేసే ముందు లోన్ తీసుకున్నవారికి ఖచ్చితంగా సమాచారం అందిస్తున్నారా ? కంపెనీలు ఇలాంటి వివరాలను సేకరించాలని సిఫార్సు చేసింది.

సాధారణంగా NBFCలు గోల్డ్ లోన్స్ అందించేటప్పుడు బంగారాన్ని వారే కొనుగోలు చేయాలి. కానీ లోన్ తీసుకునేవారి నుండి బంగారాన్ని సేకరించి బరువును స్వయంగా చెక్ చేసి బంగారాన్ని వాల్ల దగ్గరనే పెట్టుకుంటున్న ఫైనాన్షియల్ ఏజెంట్లు ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. ఇంకా ఇలాంటి మరికొన్ని లోపాలను కూడా కనిపెట్టింది. అయితే బంగారం బరువుకు అనుగుణంగా లోన్ మొత్తం లేదని, టాప్-అప్ లోన్లకు సంబంధించిన నిబంధనలు పాటించలేదని తేలింది. అందుకే వీటన్నింటినీ ఎదుర్కోవడానికి గోల్డ్ లోన్ ప్రక్రియను కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. అన్‌సెక్యూర్డ్ లోన్లపై కఠినమైన నిబంధనలను అమలు చేయడంలో రిజర్వ్ బ్యాంక్ విజయం సాధించింది. ఇప్పుడు, గోల్డ్ లోన్స్ పై కూడా రేగుటరీ కఠినమైన నిబంధనలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలో బంగారం వినియోగంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. భారతీయులకు బంగారం అంటే ఒక ఒక్క అనుభూతి. విళ్ళు ఖచ్చితంగా ఇంట్లో చాలా బంగారాన్ని దాచిపెడతారు. అయితే, గత కొన్ని నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతుండడంతో, తక్కువ వడ్డీ రేట్లకు లోన్స్ పొందడానికి ప్రజలు బ్యాంకులకు బదులు బంగారం తాకట్టు పెడుతున్నారు. ఫలితంగా, గోల్డ్ లోన్స్ రుణాలు 50 శాతం పెరిగాయి. దీంతో, రిజర్వ్ బ్యాంక్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది.
More From GoodReturns

బ్యాంక్ సెలవులు నేడు: మీ పనులు ఆగిపోకుండా ఇలా చేయండి

GR RBI MPC Poll: ఏప్రిల్లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

బ్యాంకు సెలవులు: మీ డబ్బు పనులను ఇప్పుడే పూర్తి చేసుకోండి

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

ఆర్బీఐ నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గుతుందా లేక పెరుగుతుందా?

నేడు బ్యాంక్ సెలవు: మీ డబ్బు లావాదేవీలు ఆగిపోతాయా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications