జూన్ 6న జరగనున్న సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించే అవకాశం ఉందని మనీకంట్రోల్ నిర్వహించిన ఆర్థికవేత్తలు, బ్యాంక్ ట్రెజరీ హెడ్‌ల పోల్ అంచనా వేసింది. ఇందుకు ఆర్‌బిఐ ఎంపిసి జూన్ 4న సమావేశమై జూన్ 6న నిర్ణయాన్ని ప్రకటించనుంది.

వరుసగా మూడో నెలలో కూడా కన్స్యూమర్ ప్రయిస్ ఇండెక్స్(CPI) తగ్గడం (ఇది ఆర్‌బిఐ మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కంటే తక్కువగా ఉంది) బెంచ్‌మార్క్ రేట్లను మరింత తగ్గించడానికి అవకాశమిచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర బ్యాంక్ ఆర్థిక వృద్ధిపై మరింత దృష్టి సారించిందని తెలిపారు. ఒకవేళ జూన్ ఎంపీసీలో ఆర్‌బిఐ కీలక రేట్లను తగ్గిస్తే వృద్ధికి మరింత మద్దతు ఇచ్చే ప్రయత్నంలో, ఫిబ్రవరి ఇంకా ఏప్రిల్ తర్వాత ఎంపిసి వరుసగా మూడవసారి రేటు తగ్గింపును చేపట్టినట్లవుతుంది.ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వృద్ధికి మద్దతు: ఏప్రిల్ mpcలో ఆర్‌బిఐ వైఖరిని 'తటస్థ' నుండి 'అకమోడేటివ్కి మార్చుకుంది. దీని అర్థం ఆర్థిక వృద్ధిని పెంచడానికి, ద్రవ్య సరఫరా విస్తరించడానికి కేంద్ర బ్యాంక్ సిద్ధంగా ఉంది. ఈ విధానంలో వడ్డీ రేట్లను తగ్గించి, రేట్ల పెంపును తోసిపుచ్చుతుంది. ద్రవ్యోల్బణం ఆందోళన లేనప్పుడు వృద్ధికి మద్దతు అవసరమైనప్పుడు ఈ విధానాన్ని అవలంబిస్తారు.
ఆర్‌బిఐ డివిడెండ్, ద్రవ్యోల్బణ అంచనాలు: ఆర్‌బిఐ విడుదల చేసిన రూ.2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్ ఆర్థిక పరిస్థితిని సులభతరం చేస్తుందని, ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.4 శాతంగా ఉంచడంలో ప్రభుత్వానికి సహాయపడుతుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. రేటు కోతలు వేగంగా విస్తరించడానికి ట్రెజరీ హెడ్‌లు ఆర్‌బిఐ నుండి మరిన్ని లిక్విడిటీ ఇంజెక్షన్లను ఆశిస్తున్నారు.
ట్రంప్ విధించిన సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రభావం చూపుతాయని ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం, ప్రధాన ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ లక్ష్యం కంటే తక్కువగా ఉండటంతో జూన్ పాలసీలో ద్రవ్యోల్బణ అంచనాలను సవరించవచ్చని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. అయితే, రుతుపవనాల అనిశ్చితి కారణంగా అంచనాలో పెద్ద తగ్గింపు ఉండకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.
వృద్ధి అంచనాలు: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో ఆర్‌బిఐ వృద్ధి రేటు అంచనాలను మార్చుకునే అవకాశం లేదని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే, మరికొంతమంది నిపుణులు వృద్ధి అంచనాలో స్వల్ప తగ్గింపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ mpcలో ఆర్‌బిఐ FY26 సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు అంచనాను 6.7 శాతం నుండి 6.5 శాతానికి సవరించింది. ప్రపంచ వాణిజ్య ఘర్షణల వల్ల ప్రపంచ వృద్ధిపై ప్రభావం దేశీయ వృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తుందని ఆర్బీఐ గవర్నర్ అప్పట్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications