ప్రతిచోట ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ వాడడం, ప్రతి ఒక్కరికి డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి రావడంతో యూపీఐ వాడే వారు పెరిగి పోతున్నారు. దింతో యుపిఐ లైట్ యూజర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ తీపి కబురు అందించింది. ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ పెంచే ప్రయత్నంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యుపిఐ లైట్ వాలెట్ లిమిట్ రూ. 5వేలకి పెంచింది, ప్రతి ట్రాన్సక్షన్ లిమిట్ కూడా రూ. వెయ్యికి పెంచింది. 9 అక్టోబర్ 2024న ఆర్బీఐ మానిటరీ పోలిసి కమిటీ (MPC) సమావేశం తర్వాత ప్రకటించిన ఈ సవరణలు యూపీఐ లైట్‌ను ఎక్కువగా వాడుతుండడాన్ని ప్రోత్సహించడం ఇంకా ఆఫ్‌లైన్ ట్రాన్సక్షన్ ఈజీ చేయడం, కస్టమర్లకు మరింత అతుకులు లేని అనుభవాన్ని అందించడం లక్ష్యంగా తీసుకొస్తుంది.
యూపీఐ లైట్ కోసం ట్రాన్సక్షన్ పరిమితి 5 వందల నుండి రూ. వెయ్యికి పెంచారు, ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేకుండా యూజర్లు అధిక మొత్తాన్ని ఆఫ్‌లైన్ పేమెంట్స్ ద్వారా చేయడం సులభం చేస్తుంది. యుపిఐ లైట్ కోసం మొత్తం వాలెట్ పరిమితి రూ. 2వేల నుండి రూ. 5వేల కి పెంచింది. ఈ మార్పు చిన్న-మొత్తం ట్రాన్సక్షన్ కోసం యూజర్లు వాలెట్‌లో ఎక్కువ డబ్బు యాడ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఉపయోగించిన లిమిట్ అయిపోయాక మళ్ళీ ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే వాలెట్లోకి అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు, దీనికి అడిషనల్ ఫాక్టర్ అథెంటికేషన్ (AFA) ద్వారా హై లెవెల్ సెక్యూరిటీ అందిస్తుంది.

యుపిఐ పిన్ లేదా రియల్-టైం ట్రాన్సక్షన్ అలర్ట్స్ అవసరం లేకుండా చిన్న-మొత్తం డిజిటల్ పేమెంట్స్ సులభం చేయడానికి యుపిఐ లైట్ రూపొందించారు. ఈ సిస్టమ్ కింద ట్రాన్సక్షన్ ఆఫ్‌లైన్‌లో ఉంటాయి, అంటే వాటికి యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. ముఖ్యంగా తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో యుపిఐ లైట్‌ను ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే యుపిఐ ఇప్పటికే శ్రీలంక, మారిషస్, సింగపూర్ వంటి దేశాల్లో ఉపయోగించబడుతుంది. ప్రస్తుతం, ఇలాంటి సిస్టంను ప్రవేశపెట్టేందుకు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని 20కి పైగా దేశాలతో చర్చలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications