RBI చొరవ.. మీ బంధువుల డబ్బు బ్యాంకులో క్లెయిమ్ చేయకుండా ఉందేమో తెలుసుకోండిలా..!

Unclaimed Money: గురువారం మానిటరీ పాలసీలో తీసుకున్న కీలక నిర్ణయాలను రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీనిలో రెండు ముఖ్యమైన శుభవార్తలు ఉన్నాయి. ఒకటి ఈసారికి వడ్డీ రేట్లను పెంచకుండా ఉండటం అయితే.. రెండవది బ్యాంకుల వద్ద క్లెయిమ్ చేయకుండా ఉన్న వేల కోట్ల ప్రజల సొమ్ము గురించి. దేశంలోని చాలా బ్యాంకుల్లో డిపాజిట్లుగా లేదా సేవింగ్స్ ఖాతాల్లో ఉంచి తీసుకోని డబ్బు విషయంలో కీలక ప్రకటన జరిగింది.

దేశంలోని బ్యాంకుల్లో మూలుగుతున్న ఎవరూ క్లెయిమ్ చేయని వేల కోట్ల గురించి రిజర్వు బ్యాంక్ తాజాగా వెబ్ పోర్టల్ ప్రారంభించింది. దీని ద్వారా చట్టపరమైన వారసలు లేదా లబ్ధిదారులు ఆ డబ్బును పొందటానికి అవకాశం లభించనుంది. అలా పాత కాలంలో తాతలు, ముత్తాతలు బ్యాంకుల్లో జమచేసి మర్చిపోయిన డబ్బును ఇప్పుడు పొందేందుకు మార్గం సుగమం కానుంది. 2022 లెక్కల ప్రకారం రిజర్వు బ్యాంక్ వద్ద రూ.48,262 కోట్లు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి. తాజాగా 2023 ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ మెుత్తం రూ.35,012 కోట్లుగా ఉంది.

Reserve bank launching web portal to check unclaimed deposits of your family members, Know in detail

ఈ డిపాజిట్ల కోసం రిజర్వు బ్యాంక్ ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను సిద్ధం చేసింది. కొత్త డిపాజిట్ల సొమ్ము అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్‌లలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇలాంటి అనేక చర్యలు తీసుకుంటున్నామని శక్తికాంతదాస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను వాటి చట్టపరమైన యజమానులకు చేరుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వారిని గుర్తించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వెబ్ పోర్టల్‌ను సిద్ధం చేసింది. దీంతో క్లెయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించి సరైన ఇన్‌పుట్‌తో వివిధ బ్యాంకుల డిపాజిటర్ల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీ పూర్వికులు లేదా బంధువులకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

గడచిన 10 సంవత్సరాల్లో ఖాతాదారుడు బ్యాంక్ నుంచి తన డిపాజిట్ సొమ్మును విత్ డ్రా చేయనప్పుడు కాలంలో ఖాతాలో ఉన్న మొత్తాన్ని అన్‌క్లెయిమ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. బ్యాంకులు కూడా ఈ కస్టమర్లను సంప్రదించడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియలో సదరు ఖాతా వివరాలను బ్యాంకులు ఆర్బీఐకి తెలియజేస్తాయి. ఆ తర్వాత ఈ అన్‌క్లెయిమ్ డిపాజిట్ సొమ్ము డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEAF)కి బదిలీ చేయబడుతుంది. గతంలో నామినీ వివరాలను అందించని వారి ఖాతాల్లో ఇలాంటి క్లెయిమ్ చేయని సొమ్ము మూలుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+