Repo Rates: నిపుణులు, పరిశ్రమవర్గాలు, మార్కెట్లు ఊహించినట్లుగానే రిజర్వు బ్యాంక్ ఈ సారి కూడా వడ్డీ రేట్లను పెంచకూడదని నిర్ణయించింది.వరుసగా రెండో సారి రేట్ల పెంపుకు బ్రేక్ వేస్తూ ఊరటను ప్రకటించింది. ఎంపీసీ తీసుకున్న నిర్ణయాలను రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు.
ఎంపీసీ సమావేశంలో మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు తాజా ప్రకటన వెలువడింది. నేటి పాలసీలో వడ్డీ రేట్లను హోల్డ్‌లో ఉంచడానికి ప్రధాన కారణం దేశ సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం అంచనాలను తగ్గించటం. దీనికి తోడు వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మార్చి 2023లో 5.7% నుంచి ఏప్రిల్ 2023లో 18 నెలల కనిష్ఠమైన 4.7%కి తగ్గింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం తగ్గింపు కోసం వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని కమిటీ నిర్ణయించింది.

మార్కెట్లో అనేక మంది ఆర్థిక వేత్తలతో పాటు, ఇండస్ట్రీ వర్గాలు గత కొన్ని రోజులుగా వడ్డీ రేట్ల పెంపు బ్రేక్ కొనసాగుతుందని ఆశించారు. ఇప్పటికే వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిల వద్ద ఉన్నందున ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోంది. రానున్న సమావేశాల్లో సైతం ఇదే ధోరణిని రిజర్వు బ్యాంక్ కొనసాగించవచ్చని తెలుస్తోంది. తద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో రేట్ల తగ్గింపులకు వెళ్లవచ్చని నిపుణులు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు.
ఇదే క్రమంలో ద్రవ్యోల్బణం అంచనాలను 5.2 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రానున్న కాలంలో నమోదయ్యే ద్రవ్యోల్బణం డేటా ప్రకారం నిర్ణయాలు వేగంగా మారే అవకాశం ఉంది. అలాగే రానున్న ఏడాది కాలంలో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications