RBI Rate Hike: యూనియన్ బడ్జెట్ తర్వాత రిజర్వు బ్యాంక్ కొత్త ఏడాది తన తొలి మానిటరీ పాలసీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ రోజు నిర్వహిస్తున్న సమీక్షా మనావేశంలో కీలక వడ్డీ రేటు అయిన రెపో రేటును 25 పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన ఎంపీసీ సమావేళాల్లో చివరి రోజున గవర్నర్ శక్తికాంత దాస్ రేట్ల ప్రకటన చేశారు.

ఈ కారణాలతో..
రిటైల్ ద్రవ్యోల్బణం మోడరేషన్ సంకేతాలను చూపడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 శాతం ఎగువ టాలరెన్స్ స్థాయి కంటే తక్కువగా ఉండటం, ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం కావటం లాంటి కారణాల వల్ల సెంట్రల్ బ్యాంక్ ఈ సారి రేట్ల పెంపులో దూకుడు తగ్గించింది. ఈ వేగంగా గతంలో మాదిరిగా కొనసాగితే జీడీపీ వృద్ధి మందగిస్తుందని నిపుణులు అంచనా వేసిన తరుణంలో కీలక వడ్డీ రేట్ల పెంపులో ఆర్బీఐ జాగ్రత్తగా ముందుకు సాగుతున్నట్లు చెప్పుకోవచ్చు.

గతంలో పెంపు ఇలా..
ద్రవ్యోల్బణం కారణంగా రిజర్వు బ్యాంక్ 2022 మే నుంచి రెపో రేటు పెంపును కొనసాగిస్తోంది. అప్పట్లో మెుదటిసారి 40 బేసిస్ పాయింట్లను పెంచింది. ఆ తర్వాత మూడు సార్లు జూన్ నుంచి అక్టోబర్ మధ్య నిర్వహించిన ఎంపీసీ సమావేశాల్లో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును ఆర్బీఐ పెంచింది. చివరిగా డిసెంబర్ లో నిర్వహించిన ద్రవ్యపరపతి సమావేశంలో రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపులో దూకుడును కొంత తగ్గించి 35 బేసిస్ పాయింట్లకు పరిమితం చేసింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతానికి చేరుకుంది.

రుణాలపై ప్రభావం..
రిజర్వు బ్యాంక్ తన వడ్డీ రేట్లను పెంచటం వల్ల గృహ రుణాలు, కారు లోన్స్, పర్సనల్ లోన్స్ వంటివి కొంత మేర ఖరీదు కానున్నాయి. ఇది రుణగ్రహీతలకు కొంత భారాన్ని కలిగిస్తున్నప్పటికీ పొదుపరులకు మాత్రం మంచి వడ్డీ ఆదాయం లభిస్తోంది. వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా బ్యాంక్ డిపాజిట్లపై రేట్లు మరింత ఆకర్షనీయంగా మారాయి.


Click it and Unblock the Notifications