బ్యాంకులపై ఆర్బీఐ కొరడా.. రూల్స్ పాటించనందుకు లక్షల్లో జరిమానా.. కోట్ల కస్టమర్లపై ఎఫెక్ట్ ?

RBI Imposes Penalty: నిబంధనలను పాటించని బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జరిమానా విధిస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఆర్‌బిఐ ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్‌లపై పెనాల్టీ విధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ సహా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) లపై కొరడా ఝుళిపించింది. అయితే బ్యాంకుల కొన్ని లోపాల కారణంగానే ఈ జరిమానాలు విధించినట్లు ఆర్‌బిఐ తెలిపింది.

reserve bank imposed penalty on three big banks including PNB will it effect oncustomers

కోటక్ మహీంద్రా బ్యాంక్ పై రూ.61.4 లక్షల జరిమానా: కోటక్ మహీంద్రా బ్యాంక్‌ పై ఆర్‌బిఐ రూ.61.4 లక్షల జరిమానా విధించింది. 'బ్యాంక్ క్రెడిట్ డెలివరీ కోసం లోన్ వ్యవస్థపై మార్గదర్శకాలు' ఇంకా 'రుణాలు & అడ్వాన్సులు - చట్టబద్ధమైన అలాగే ఇతర పరిమితులు' వంటి నియమాలను బ్యాంక్ పాటించనందున ఈ జరిమానా పడింది. ఈ జరిమానా కేవలం నిబంధనలు లేకపోవడం వల్లనే విధించబడిందని, బ్యాంకు కస్టమర్‌ ట్రాన్సక్షన్ లేదా ఇతర వాటికీ సంబంధించి కాదని ఆర్‌బిఐ తెలిపింది.

HDFC ఫస్ట్ బ్యాంక్‌పై రూ.38.6 లక్షల జరిమానా: ఇక ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ రూ.38.6 లక్షల జరిమానా విధించింది . 'KNOW YOUR CUSTOMER (KYC)' నియమాలను పాటించనందుకు ఈ జరిమానా పడింది. కస్టమర్ల గుర్తింపు ఇంకా వారి ట్రాన్సక్షన్స్ వెరిఫై చేయడానికి KYC నియమాలు ముఖ్యమైనవి. అందుకే ఈ జరిమానా పడింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) పై రూ.29.6 లక్షల జరిమానా : పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) పై RBI రూ.29.6 లక్షల జరిమానా విధించింది . 'బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్'కు సంబంధించిన నియమాలను పాటించనందుకు ఈ జరిమానా విధించింది. బ్యాంకులు కస్టమర్లకు మెరుగైన అలాగే పారదర్శక సేవలను అందించేలా కస్టమర్ సర్వీస్ నియమాలు నిర్ధారిస్తాయి. ఈ జరిమానా కూడా నియమాలు పాటించనందుకు మాత్రమే అని RBI స్పష్టం చేసింది.

మొత్తంగా నిబంధనలను పాటించడంలో బ్యాంకులు విఫలమైనందున ఈ జరిమానాలు విధించడం జరిగిందని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది . బ్యాంకులు నియమాలను పాటించేలా ప్రోత్సహించడమే ఆర్‌బిఐ లక్ష్యం. ఈ జరిమానాలు బ్యాంకు ఇంకా కస్టమర్ల మధ్య ఏదైనా ట్రాన్సక్షన్ లేదా సంబంధిత విషయాలపై కాదని RBI క్లారిటీ ఇచ్చింది.

కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే : నిబంధనలను పాటించనందుకు బ్యాంకులపై ఆర్‌బిఐ ఈ జరిమానా విధిస్తుంది. దీనికి బ్యాంకు కస్టమర్‌తో ఎలాంటి సంబంధం లేదు. అలాగే బ్యాంకింగ్ కార్యకలాపాలపై కూడా దీని ప్రభావం ఉండదు. బ్యాంకు ద్వారా కస్టమర్లకు అందిందిస్తున్న సేవలు ఎప్పటిలాగే నిరంతరం కొనసాగుతాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+