RBI News: వడ్డీ రేట్ల తగ్గింపుపై కీలక ప్రకటన చేసిన ఆర్‌బిఐ గవర్నర్.. ఏమన్నారంటే..
Shaktikanta Das: ఆర్థిక రంగంలో భారత్ మంచి ప్రగతిని సాధించిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దావోస్‌లో అన్నారు. ఆర్థిక సవాళ్లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇండియా ఘర్షణతో కూడిన భౌగోళిక రాజకీయ సమస్యలను నిర్వహించగలుగుతోందని దాస్ పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలు ప్రపంచానికి సవాళ్లున్నాయన్నారు. ద్రవ్యోల్బణం, ధరలను అదుపులో ఉంచేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అలాగే గత ఐదేళ్లలో ఆర్థిక రంగంలో చాలా స్థిరత్వం నెలకొందని వెల్లడించారు.

ప్రస్తుతం దేశ ఉత్పత్తి సామర్థ్యంలో 75 శాతం వినియోగిస్తున్నట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో రేట్లు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే గత మూడేళ్లుగా భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉందన్నారు. వడ్డీ రేట్ల కోత ప్రస్తుత ఎజెండాలో లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లోనూ ప్రపంచవ్యాప్తంగా భారత్‌పై విశ్వాసం పెరిగిందని దాస్ అన్నారు.
2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7 శాతం ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ వెల్లడించారు. FY2024లో GDP వృద్ధి 7.4 శాతంగా ఉంటుందని NSO పేర్కొంది. వచ్చే ఏడాది కూడా ఈ వృద్ధి కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో డిపాజిట్ల వృద్ధి 12-13 శాతంగా ఉందన్నారు. భద్రత లేని రుణాల గురించి ఆర్‌బిఐకి తెలుసునని శక్తికాంత దాస్ తెలిపారు. క్రెడిట్ పర్యావరణ వ్యవస్థ పర్యవేక్షించబడుతోంది. ఇందులో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకుల పనితీరు మెరుగుపడిందని వెల్లడించారు.


Click it and Unblock the Notifications