వచ్చే వారంలో మళ్లీ కీలక వడ్డీ రేట్లు పెంచనున్న రిజర్వు బ్యాంక్.. ఈ సారి ఎంతో తెలిస్తే షాకవుతారు..
మే 4న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అకస్మాత్తుగా నిర్వహించిన మానిటరీ పాలసీలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో గవర్నర్ శక్తికాంత దాస్ రిటైల్ ద్రవ్యోల్బణం దృష్ట్యా రానున్న సమీక్షలో కూడా ఇదే కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు. అయితే.. రిజర్వ్ బ్యాంక్ వచ్చే వారం ద్రవ్య విధాన షెడ్యూల్ సమీక్షలో మరో 40 బేసిస్ పాయింట్ల రేటు పెంపును ప్రకటించే అవకాశం ఉందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ శుక్రవారం తెలిపింది.
సెంట్రల్ బ్యాంక్ రేట్ సెట్టింగ్ ప్యానెల్ ఆగస్టులో తదుపరి సమీక్షలో 0.35 శాతం పెంపుతో దీన్ని అనుసరిస్తుంది లేదా వచ్చే వారం 0.50 శాతం వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని వారు లెక్కగడుతున్నారు. బోఫా సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం ఆగస్టు నాటికి మెుత్తం రేటు పెంపుదల 0.75 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే హౌసింగ్ లోన్ తో పాటు ఇతర రకాల రుణాలు తీసుకున్న సామాన్యులపై వడ్డీ భారం తప్పదు.

ద్రవ్యల్బణాన్ని తగ్గించేందుకు చర్యలు:
అయిదే ద్రవ్యోల్బణాన్ని 6 శాతం కంటే తగ్గించేందుకు రిజర్వు బ్యాంక్ ప్రయత్నిస్తోంది. కానీ.. మే నెలలో టొమాటో ధరలు భారీగా పెరగడం వల్ల ప్రధాన ద్రవ్యోల్బణం 7.1 శాతానికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది.ఇంధన ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, క్రూడ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై డ్యూటీ ఫ్రీ దిగుమతులు, ATF ధరల్లో కోత వంటి చర్యల గురించి ప్రస్తావిస్తూ.. అటువంటి చర్యలు ద్రవ్యోల్బణం పెరుగుదలను నివారించడానికి సహాయపడతాయని అంచనా వేసింది.అయితే.. వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం FY23లో RBI నిర్దేశించుకున్న 6 శాతం కంటే ఎక్కువగా.. అంటే 6.8 శాతంగా ఉంటుందని పేర్కొంది.

3రెపో రేట్లలో మార్పులు:
ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ తన అంచనాను ప్రస్తుత 5.7 శాతం నుంచి FY23లో 6.5 శాతానికి పెంచుతుందని సంస్థ పేర్కొంది. కీలకమైన విషయం ఏమిటంటే.. ఆర్‌బీఐ ఎంపీసీ ఆగస్టు నాటికి అల్ట్రా అకామిడేషన్ నుంచి నిష్క్రమిస్తుంది. పాలసీ రెపో రేటును కరోనా ముందు స్థాయి అయిన 5.15 శాతానికి తీసుకువెళుతుంది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం ఎక్కువగా కొనసాగినట్లయితే.. రిజర్వు బ్యాంక్ రెపో రేటును FY23 చివరి నాటికి 5.65 శాతానికి తీసుకెళుతుందని వెల్లడించింది.

మార్కెట్లో లిక్విడిటీ తగ్గించేందుకు చర్యలు:
మార్కెట్ లోని అదనపు నగదును ఉపసంహరించుకోవడం ద్వారా లిక్విడిటీ పరిస్థితులను సాధారణీకరించడానికి సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తున్నందున.. క్యాష్ రిజర్వ్ రేషియా (CRR)లో మరో 0.50 శాతం పెరుగుదల ఉండవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. మార్కెట్ నుంచి దాదాపు రూ.87,000 కోట్ల లిక్విడిటీని తగ్గించేందుకు మే 4న RBI CRRని 0.50 శాతం పెంచి 4 శాతానికి తీసుకొచ్చింది. అయితే.. 2023 ఆర్థిక సంవత్సరానికి తన జీడీపీ అంచనాలను బ్రోకరేజ్ 7.4 శాతాన్ని కొనసాగిస్తుండగా.. రిజర్వు బ్యాంక్ 7.2 శాతం అంచనాను కొనసాగిస్తుందని అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications