ATM cash withdraw rules: ఇప్పుడు మీరు ATM నుండి డబ్బు విత్ డ్రా చేసేందుకు అలాగే బ్యాలెన్స్ చెక్ చేయడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి కావొచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ATM ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపుదలకు ఆమోదం తెలిపింది. దింతో మే 1 నుండి డబ్బు విత్ డ్రా వంటి ఆర్థిక లావాదేవీలకు చార్జెస్ రూ. 2 పెరగనుంది ఇంకా బ్యాలెన్స్ చెకింగ్ చార్జెస్ రూ.1 పెరుగుతుంది. అంటే ఇప్పుడు క్యాష్ విత్ డ్రాకు ఇంటర్‌చేంజ్ చార్జెస్ రూ.17 నుండి రూ.19కి పెరుగుతుంది అలాగే బ్యాలెన్స్ చెకింగ్ చార్జెస్ రూ.6 నుండి రూ.7కి పెరుగుతుంది. దింతో దేశంలోని కోట్లాది మంది బ్యాంక్ కస్టమర్లకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

ఈ మార్పులు చిన్న బ్యాంకులను, ముఖ్యంగా సొంతంగా చిన్న ATM నెట్‌వర్క్ ఉన్న బ్యాంకులను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. పాత చార్జెస్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఎటిఎం కార్యకలాపాలను నిర్వహించడం కష్టంగా మారడంతో వైట్-లేబుల్ ATM ఆపరేటర్లు చార్జెస్ పెంచాలని డిమాండ్ చేశారని వర్గాలు తెలిపాయి. దింతో ఈ భారాన్ని తగ్గించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల చార్జీల పెంపు ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత 10 సంవత్సరాలలో ఇంటర్‌చేంజ్ ఫీజు పెంచినప్పుడల్లా దాని ప్రభావం నేరుగా కస్టమర్లపై పడింది.
ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే ఏమిటి: ATM ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే మీరు ఏదైన ATMని ఉపయోగించినప్పుడు ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు చెల్లించే చార్జెస్. ఈ చార్జీలు మీ ట్రాన్సక్షన్స్ లో భాగం ఇంకా తరచుగా కస్టమర్ నుండి వసూల్ చేస్తుంది. ఈ కొత్త మార్పు గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మార్చి 13న బ్యాంకులకు తెలియజేసింది. ఛార్జ్స్ పెంచడానికి NPCI RBI నుండి అనుమతి కోరింది, ఇప్పుడు దానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
కొత్త రూల్ ఏంటి : ప్రస్తుతానికి మెట్రో నగరాల్లోని ప్రజలు బ్యాంకుల ATMలను నుండి ప్రతి నెలా 5 ఫ్రీ ట్రాన్సక్షన్స్ చేసుకోవచ్చు. నాన్ మెట్రో ప్రాంతాలలో ఈ పరిమితి 3 ట్రాన్సక్షన్స్. ఫ్రీ లిమిట్ తరువాత ప్రతి ట్రాన్సక్షన్స్ పై ఛార్జ్ విధించబడుతుంది. ఇప్పుడు ఎటిఎం విత్ డ్రా చార్జీల పెరుగుదలతో చిన్న బ్యాంకుల కస్టమర్లకి ఖర్చులు మరింత పెరుగుతాయి, ఎందుకంటే ఈ బ్యాంక్ కస్టమర్లు ఎక్కువగా ఇతర బ్యాంకుల ATMలను ఉపయోగించాల్సి వస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications