RERA: దేశీయ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం వేగంగా వృద్ది చెందుతోంది. శ్రీమంతుల దగ్గర నుంచి పేద, మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వారిని మరింత ప్రోత్సహించేందుకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
సొంతిల్లు కలిగి ఉండాలనేది దాదాపు ప్రతి ఒక్కరి కల. దీంతో పలువురు బిల్డర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల బిల్డర్ వద్ద ఇంటి కొనుగోలుకు చేసిన బుకింగ్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ప్రారంభంలో చెల్లించిన బుకింగ్ అమౌంట్‌లో క్యాన్సిలేషన్ రుసుము, ఒప్పంద ఉల్లంఘన జరిమానా రూపేణా భారీ మొత్తాన్ని బిల్డర్ వసూలు చేస్తారు.

కాగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) సరిగ్గా ఇక్కడే ఉపశమనం కలిగించే ప్రకటన ఒకటి చేసింది. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల కోసం కొత్త రూల్ అమలుచేస్తున్నట్లు చెల్లిపంది. ఇంతకుముందు వరకు బిల్డర్లు ఇంటి మొత్తం ఖర్చులో 10 శాతాన్ని బుకింగ్ రద్దు ఛార్జీలుగా వసూలు చేసేవారు. దీనిద్వారా కొనుగోలుదారులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నట్లు రెరా గుర్తించింది.
దీంతో తాజా నిబంధనల ప్రకారం ఆ ఛార్జీని కేవలం 2 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇంటి బుకింగ్ రద్దు చేస్తే బిల్డర్‌కు చెల్లించాల్సిన నష్టపరిహారం.. మొత్తం ధరలో కేవలం 2 శాతం మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన వల్ల గృహ కొనుగోలుదారులకు చాలా మొత్తం ఆదా అవుతుంందని రెరా తెలిపంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications