Gold Update: గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం..!
బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిక పన్నుల భారం కారణంగా అక్రమంగా బంగారం, వెండి దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు మనీ కంట్రోల్ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖలో చర్చ జారుతున్నట్లు సమాచారం. సుంకం తగ్గింపుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, సుంకాన్ని తగ్గించడం వల్ల బంగారం అక్రమ రవాణా తగ్గే అవకాశం ఉంది. అందుకే సుంకం తగ్గింపుపై ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం 15 శాతంగా ఉన్న సుంకాన్ని 6 శాతానికి తగ్గించాలని బులియన్ వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు కేంద్రాన్ని కోరుతున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు(డాలర్ నిల్వలు) కాపాడేందుకు, రూపాయి విలువ క్షీణించకుండా ఉండేందుకు ఈ సంవత్సరం మే 13న బంగారం, వెండిపై కేంద్రం దిగుమతి సుంకం విధించింది. 6 శాతం ఉన్న సుంకాన్ని 15 శాతానికి పెంచింది. దీని వల్ల బంగారం ధర పెరిగింది. ప్రతిగా అక్రమ మార్గాల్లో బంగారం దేశంలోకి వస్తోంది. అయితే సుంకాన్ని తగ్గించడం వల్ల అనధికారిక మార్గాల ద్వారా దేశంలోకి వచ్చే బంగారం తగ్గుతుందని, తద్వారా అక్రమ రవాణాకు ఉన్న ప్రోత్సాహం తగ్గుతుందని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారులలో ఒకటిగా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అలాగే, భారత్ యూఏఈ (UAE), థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాలకు బంగారు ఆభరణాలను ఎగుమతి చేస్తోంది. సుంకం పెంపునకు ముందు ఏప్రిల్ 2026లో బంగారం దిగుమతులు ఏడాది ప్రాతిపదికన దాదాపు 82 శాతం పెరిగాయి. అధిక దిగుమతులు దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని పెంచడంతో పాటు 'కరెంట్ అకౌంట్ లోటు' (CAD)ను కూడా విస్తృతం చేస్తాయి కాబట్టి, దిగుమతుల్లోని ఈ పెరుగుదల ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ఇది రూపాయి విలువపై కూడా ఒత్తిడిని పెంచుతుంది. మే మధ్య నాటికి రూపాయి విలువ అప్పటికే 6 శాతానికి పైగా పడిపోయింది. దీంతో బంగారంపై దిగుమతి సుంకం పెంచాల్సి వచ్చింది. మేలో సుంకం పెంపు కేవలం సగం నెల మాత్రమే అమల్లో ఉన్నప్పటికీ, బంగారం దిగుమతులు దాదాపు 34 శాతం పెరిగాయి. సుంకం పెంపు తర్వాత మొదటి రెండు నెలల్లో బంగారం దిగుమతులు 5.5 శాతం పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ విలువైన లోహాలపై సుంకం పెంపు అక్రమ రవాణాలో గణనీయమైన పెరుగుదలకు దారితీసిందని బంగారు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వేళ ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications